సత్యరాజా పూర్వదేశయాత్రలు
మహా-గ్రహములు వారిని బాధించవా?
సత్య-బాధించవు. అమావాస్యనాడు బయలుదేఱినమ వారికి కార్యసిద్ధి యగుచున్నది. శూన్యమాసములో శనివారమునాడు దుర్ముహూర్తపువేళ లగ్నముపెట్టి వివాహము చేసికొన్నను దంపతులు సంతానవంతులయి వర్ధిల్లుచున్నారు. గ్రహములుకూడ వారికి భయపడినట్లు తోచుచున్నది.
మహా-నీకు తోచుచున్నది సత్యమే. పంచభూతములను లోబఱుచుకొని నిప్పుచేతను నీళ్ళచేతను బండ్లులాగించువారికి గ్రహములు భయపడి లోపడుట యాశ్చర్యముకాదు. ఏమియు భయముచేత కార్యసిద్ధిచేసినట్లు భక్తి చేత చేయవు. వెనుక మారావణునికిని భయముచేతనే కదా సూర్య చంద్రాది గ్రహములను వాయువైశ్వానరాది భూతములను చెప్పినట్లనుండి సేవచేయుచు వచ్చినవి.
సత్య-అది సత్యము. ఆహా ! ఏమి మీబుద్ధివిశేషము ! మీకు గల వర్ణ నీయమయిన శాస్త్రాభిమానము మీబుద్ధి విశేషమునకు వన్నె తెచ్చుచున్నది !
మహా-దేనిని విడిచినను శాస్త్రాభిమానమును మాత్రము విడువరాదు.శాస్త్రవిశ్వాసముచేత నేను విధ్యుక్తమూఅ వివాహము చేసికొన్న ధర్మపత్నిని సహితము తృణప్రాయముగా విడిచిపెట్టినాను.
సత్య-ఓహో ! మీరు త్రిలోకపూజ్యులుగా కనబడుచున్నారు. మీచిత్రచరిత్రయును నాశ్రోత్రపేయముచేసి నన్ను చరితార్ధుని జేయుడు. :మహా-నా ప్రధమభార్య వృషభలగ్నమున లగ్నమందు చంద్రుడును సింహమందు సూర్యుడును వృశ్చికమందు గురుడును ప్రంభమందు శనై శ్చరుడును ఉండగా ప్రధమకుమారుని గన్నది. అట్టి లగ్నమందు బుట్టినవాడు జూరజాతుడని శాస్త్రదృష్టిచేత జూ వినవాడనయి గుణపతియైన యాభార్యను తత్క్షణము త్యజించినాను.