పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   సత్యరాజా పూర్వదేశయాత్రలు

శ్వాసము లేనివారయి కొందఱు విహితధర్మములను మిఱి నడుచుచున్నారా‽

సత్య—మావా రెప్పుడును బుద్దిపూర్వకముగా శాస్త్రమర్యాడలను మిఱువారుకారు. అయినను మాదేశమునం దిప్పుడు ప్రభుత్వముచేయుచున్న హూణులు క్రొత్తగానావిరియంత్రములను కల్పించి, నీటి యావిరియొక్క బలముచెత నినుపదారులమిద తిధి వార నక్షత్రహొరాత్రనియమును పాటింఫక నిణి౯త సమయముయందు ప్రతిదినమునుపొగబండ్లను వాయువేగమున నడిపించుచు జనులశాస్త్రచొదితాచారములకు భంగము చేయుచున్నారు. అందుచేత జనులిప్పుడు శాస్త్రమర్యాదల నంతగా పాటింపక ప్రయాణసౌలభ్యమునుబట్టి పొగబండ్లలో నెక్కి జ్యోతిష్కులు పెట్టినముహూర్తములనుమాని జాతివా రేర్పఱిచిన వేళ్లలోనే యాత్రలుచేయ మొదలు పెట్టినవారు.

మహ—ప్రయాణసౌలభ్యమును భట్టి శాస్త్రవిదుల పతిక్రమించుట మహదొషము. అందులోను జ్యోతిశాస్త్ర సిద్దాంతములను మిఱిన పాపమునుమించిన మహపాతకము లోకములో మఱియొకటియండదు. మఱియేపాపమున కైనను నిష్కృతికలదుగాని యీపాపమునకు నిష్కృతిలేదు. దేశాభిమానులందఱును జేరిపొగభండ్లలోపొయినవారిని జాతినుండి బహిష్కారము చేసెదమని దొషజఞపమయముచేయరాదా?

సత్య—శిష్టాచార సంపన్నులయిన శ్రొత్రియశిఖమణు లనే కులు పొగబండ్లలో ప్రయానము చేయుట పాపమని భొదించినవారు గాని జనులుయనదరమువలనను ధర్మ సంస్దాపకులయిన ప్రభువులులేని లోపమువలనను వారి యుపదేశములన్నియు సరణ్య రొదనము అయిపొయినవి.ప్రయాణములకు మహూత౯ములు పెట్టించువారు