Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము తెలియదు. నలుగురును నగలు పెట్లుకొనివచ్చినప్పుడు, వట్టి మోడులాగున ఎక్కడి కయినను పేరింటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగుచున్నది. జానకమ్మా! నీకు నామగనివంటి బీదవాడు జాన-పేరమ్మతల్లీ! నేనేమో తెలియక అన్నాను కోపపడకు అని బిందె ముంచుకొని వెళ్ళిపోవుచున్నది'

తక్కినవారందఱును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలుదేఱి, " ఓసి పూజారిపాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది"కరణమువండ్లా మెంతయొయ్యారముగానడుచునో చూచినావా"" అయ్యగారి రామమ్మ కేమిగర్వమో కాని మనుష్యులతో మాటాడనేమాటాడదే" " పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునఁట!"'కన్నమ్మది కొంచెము మెల్లకన్ను సుమీ' కరణమువారి సీతమ్మకునగలే లేవే అని పరులమీఁది దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకునడిచిరి. విద్యాగంధమేయొ!ఱుగను మూఢవనితలకు మాటాడుకొనుటకంతకన్నా మంచివిషయము లేమి దొరకును? అక్కడకు వచ్చెడి స్త్రీలు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల పోట్లాటలును, మాఱుతల్లుల దుర్మార్గములును, మగల యనాదరణమును, మొదలైనవి తప్ప మఱియేమియు నుండవు.

అప్పుడు కుడిచేతిలో తాటాకులమీఁద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావిదోవతి కట్టుకొని, మడత పెట్టిన చిన్నయంగవస్త్ర మొకటి బుజముమీఁద వేసికొనిమొగమునను దేహమునను విభూతిపెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ లంతలేసి రుద్రాక్షలుగల కంఠమాలప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుముకాయ చిన్నకంతివలెఁ గనఁబడ, గట్టుమీఁదినుండిపోవుచు గోదావిరిలో స్నానము చేయువారెవ్వరోయని కనులకుచేయి యడ్డమువెట్టుకొని నిదానించిచూచి, గిరుక్కున మళ్ళి యొక బ్రాహ్మణుడు మెట్లుదిగివచ్చెను.