పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

               సత్యరాజా పూర్వదేశయాత్రలు
ష్టిచి యనంత ఫలప్రదమయిన తత్ర్పసొదశాస్త్రమును వ్యాపింపఁ జేయుట పరమసాద్యమే యని స్పురించకపొదు. నేను వ్రాయుటకుఁదగిన దుకులు గాని గంటములు గాని యాదేశములో లేనందున నా ప్రపొదజ్యొతిశాస్త్రమున కదిక గౌరవము కలుగుటకయి నేను దానినివాగ్రూపకముగనేయుంచి మన మహర్షులు వేదమును కాపాడినట్లు కాపాడుచున్నాను. ఆదేశమునందలి గంటములు మన గునపములకంటె మూడురెట్లు పొడుగును రెండురెట్లు లావును గలిగియుండుతచేత వాని నెత్తుటకే మకు నాద్యాముకాదు. ఇఁకనక్కడి తాటాకన్ననో మనపెద్ద పరుపులంతచేసి వెడల్పుకలవయి వానికంటె దశిగుణములునిడిని కలవిగా నుండును.

నాధర్మకర్తయైన మహకాయుఁడొకవాఁడు నాపద్ద నియమింపబడిన యర్చకులు నాకు య్రెక్కుకొనువారు చెల్లించు ముడుపులుతానుకులు దక్షిణలు నిలువుదొపులు మొదలయిన వానినిగూర్చి క్రమమయిన లెక్కలుంచి వచ్చినసొమ్మంతయుప్రతిదినమును సరిగా ధర్శకర్తకుఁబంవుచున్నారో లేదో విచారుంచుటకయి నన్నుంచిన యాల యమునకువచ్చి నాయాదాయస్యయములను విమర్శించి వారిండ్లకుఁబంపివేసి తరువాత వారు స్వామిసొమ్ము నేమయిన సవహరించుచున్నారాయని నన్నడిగెను. నెను చిఱునవ్వునవ్వి యడిగినదానికి తగిన సదు త్తరమియ్యక క్ష్యాతిషభూమిలొఁ దమకు విశదముగాని దేమున్నాదని పలికి, జ్యోతిశ్శాస్త్ర ప్రశంసచేసి మొదటిసంగతి మఱపించి మెల్లగానతనిని శాస్త్రచర్చకుదింపితిని. తిరుమల;మొదలయిన దివ్యస్దలములలో భక్తులు సమర్పించు దేవుని సొమ్ములోపూజారులు మొదల యినవారు నిత్యకృత్యముగా చేసెడుకెంకర్యరహస్యములు మికు కొట్టింపిండియగుటచేతి మికాడేవరహస్యములను తెలపవలసిన యావశ్యకము మొదలే లేదుగదా? నేను శాస్త్రచర్యకు దింపినతరువాత మహకాయఁడు జ్యోతిశాస్త్రమునందు మహభిమానమును సంపూ