పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/352

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

        346 సత్యరాజా పూర్వదేశయాత్రలు

వచ్చెను. ఈప్రకారముగా నేనాదేశమునం దల్పకాలములోనే చిఱు దేవతనయి పోయినాను. నామహిమలు శీఘ్రకాలము లోనే చుట్టుపట్ల గ్రామములోను దూరదేశములోనుకూడ వ్యాపించినందున యాత్రాపరులు రేయింబగళ్ళు విరామము లేక దూరదేశముల నుండి సహితము మహొపహారములను సువణ మంత్రపుష్పములను ధరించి యినుకచల్లిన రాలకుండునట్లు తీర్ధప్రజలవలే రాఁదొడఁగిరి. నేను జంగమదేవతలను గాఁగానే నాయజనూనుఁడు తనమందిరము నందుఁగల యొక్కవిశాలమయిన గదిని దేవాలయమునుగా మార్చి యొక్కమూలఁపీఠకమార్చి మూలవిగ్రహమూవలె నందునన్నెత్తుగాఁగూరుచుండుఁబెట్టి జనుల తెచ్చుకానుకలు మొదలనవానిని గ్రహించుటకయి నాపై నొకయర్చకుని నేర్పరిచి తాను ధర్మకర్తయయి వచ్చిన ధనము నంతను యధేచ్చముగా తన నిమిత్తము పయేగించి కొనుచుండెను. నాయందు జనుల కింతపూజ్యతాబుద్ధి కలిగినందున కింకొక కారణము చెప్పు మరచిపోయినాను. మన్నించివినుఁడు. నేనక్కడకుఁ బోయిన నాలవనాఁడొక వృద్ధకాంత నావద్దకు వచ్చి, వాలఖిల్యాది మహషూలకు దివ్యజ్ఞానమును మహిమలను గలగని పురాణశ్రవణాదులవలన దెలిసికొనిదగుట చేత భక్తిపూర్వకముగా నాకు నమస్కరించి ప్రసవ వేదనపడుచున్న తన కోడలికి కొడుకుపుట్టునో కూఁతురుపుట్టునో చెప్పువలసినదిని ప్రార్థించెను.

ఆమె ప్రశ్నయడిగిన కాలమునందులగ్నమురవ: గురుచంద్రులు విషమరాశి నవాంశములయందుందుటచేత.

 శ్లో. ఓజర్క్షే పురుషాంశకేషు బలిభిలగ్నార్క గుర్విందుభిః
     పుంజన్మప్రవదేత్సమాం శకగతైర్యుగ్మేషు తైర్యోషితగ
     గూర్వర్కౌ విషమేనరం శశిసితా వక్రశ్చయుగ్మేస్త్రీయం
     ద్వ్యంగస్ధా బుధవీక్షణాచ్చయమళౌ కుర్వంతి పక్షేస్వకే.