పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                    లంకాద్వీపము
                                          345
చుండును. అక్కడి వారికి దివ్వజ్ఞానము మాత్రము లేదు. భగవంతుఁడు వారికి దివ్యజ్ఞాన మనుగ్రహించక పోయినందుకు కారణము లేకపోలేదు. కామరూపమును ప్రసాదించిన దేశమునందు దివ్యజ్ఞానమును గూడప్రసాదించినాపక్షమున, దివ్యజ్ఞానముచేత మాయ బట్టబయలయి కామరూపముల వలన ప్రయొజనమే లేకపునని యొంచియేయకరిమిత బుద్ధిమంతుఁడయిన యీశ్వరుఁడు వారికి లోకోపకారార్ధముగా దివ్యజ్ఞానము లేకుండుఁజేసీనాఁడు. వారి కంతకాలము నుండి కామరూపమును వహించిశక్తియున్నను వారేదైన సూక్ష్మరూపమును బొందవలెనన్న బుధ్దిపుట్టినప్పూడు చీమగానో దోమనగో పిల్లిగానో బల్లిగానో మాఱుచుండటయేకాని నావంటి యంగుష్టమాత్రశరీరము గల పురిషుఁడు కావలెనన్నబుద్ధినేటి వరకును వారిలో నోక్కనికి నుదయించక పోవుటచేత నారూపముచూడగాఁనే యెల్లివారికి అద్భుతమును గౌరవమును గనిగెనని చెప్పితినిగదా, నన్నుశోధించిచూచి నాలఖిల్యమ హర్షినిగా నిశ్చియించిన పౌరాణికులును జ్యోతిశాస్త్రవేత్తలు నారాకను గ్రామమునందంతటను ప్రకటించినందున జనులు తీర్ధప్రజలవలె వచ్చి నన్నుదర్శించిపోవ మొదలుపెట్టిరి. అక్కడివారు నాస్తికులుగాక అవతారములను మహామహిమలను నమ్మెడు ప్రమాణబుద్ధిగలభక్తిపరులగుటంజేసి నన్ను దర్శింపవచ్చువారందరును నాయందు భక్తిగలవారయి ఫలములను కానుకలను దెచ్చుచు వచ్చుటచేత మాయింట ప్రతిదినమును ఫలరాసులు పర్వముతో ప్రమానములగుచు వచ్చెను.నాయజమానుఁడు వానినన్నిటినంగడికిఁబంపి యమ్మించుచువచ్చుటచేత తద్విక్రయము కొంతవారకాతనికిని లాభకరముగనే యుండును. నామూలమునతన అ ప్పుడుకుడ తీఱుమాగమేర్పడినందుననాయాజమానుఁడుతనహృదయములో సంతోషించి కొంతకాలమయిన తరువాత దక్షిణలుకూడ నేర్పరుచి యాత్రాపరులను ప్రోత్సాహఱచుచు
        44