పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము.

కొందఱక్కడక్కడ శాస్త్రవిశ్వాసములేని నాస్తికవాదు లిప్పుడిప్పుడుద్బవిల్లు చున్నను మనదేశమునందువలెనే లంకాద్వీపమునందును సాధారణముగా జనులు శాస్త్రబద్ధులయి పూర్వాచారపరాయణులయిన శిష్టులుగానేయున్నారు. అందులోను వారికి పరమప్రామాణిక మయిన జ్యౌతిషశాస్త్రము నందు విశ్వాసమత్యధికము. ఒక్కజ్యోతిశ్శాస్త్రమే లేకయుండిన యెడల ఆదేశమును దేవ్వవహాము నందును సత్యము గనుగొనుటయే దుర్లభముగా నుండియుండును. అక్కడి జనులందఱును కామరూపులగుటను బట్టి తమ తమ యిచ్చివచ్చిన రూపములను ధరించి చౌర్యము మొదలయిన నేరములను జేయు సమర్ధులగుట చేతసాక్షలను విమర్శించి వారినిదండించుట సాధ్యముకాదు. వృశ్చికరోముఁడు సర్పరోమునిరుపమును ధరించి వచ్చి దొంగ తనము చేసినప్పుడును, సర్పరోముఁడువృశ్చికరోమునిరూపమును ధరించి వచ్చివాని భర్యాతో వ్యభిచరించినప్పుడు, దీర్ఘనాసుఁడుహ్రస్వనాసుని రూపమును ధరించివచ్చి హత్యచేసినప్పుడును, హ్రస్వనాసుఁడు దీర్ఘనాసును పూపమునుధరించివచ్చి యొరునియింటికి నిప్పుంటించి నప్పుడును, చూచినవారిని పరీక్షచేసి యపరాధులను శిక్షింపఁబూనినచో దోషులు తప్పించుకొని పోవుటయు నిష్కారనణముగా నిర్దోషులకు శిక్షలగుటయు తటస్ధించునుగదా, కాఁబట్టియేయక్కడివారు నేరములను విమర్శించుటకయి సాక్ష్యమును మానివేసి న్యాయసభలలో నెల్ల సత్యమునుగనుఁగోనుటకై యదుగురేసి చొప్పున జ్యౌతిష పండితులను బెట్టియున్నరు. వారుసత్యమును గనిపెట్టుటలో తఱుచుగా భిన్నాభిప్రాయులుగా నున్నన వారిలో నధికసంఖ్యాకుల యభిప్రాయము ననుసరించి ధర్మాధికారి దోషులకు దండనము విధించు</poem>