పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                                   లంకాద్వీపము
                                            343

మాకొక్క ముద్దకయినను చాలనట్టు కనఁబడు చున్నారు. అయినను పూర్వాచారము విడిచిపెట్టరాదు. శిష్టాచారమును మిఱులుకంటె లోకములో పాపము మఱొక్కటిలేదు. కలిమహిమచేత చండశాననుఁడైన మావిభీషణమహారాజు మనుష్యభక్షణము నిషేధించి పాపము కట్టుకొన్నాఁడు గాని రాక్షసుల కులధర్మమయిన మనుష్యాశనతను మానిపించి శాష్టాచారము చెడఁగొట్టుట నీతికాదు. నేనీసంగతిశిష్టాచారము మిఱరాడని చెప్పుచున్నానుగాని యల్పాంగులయిన మనుష్య కీటకములను తినుటచేత మాకడుపులు నిండునని చెప్పుచుండలేదు.


ఓ భరతఖండ నివాసులారా, ఈతఁడు విభీషణుని పరిపాలనలో నున్నను మనస్సులో తన రాక్షసస్వభావము నెట్టువిడువకున్నాఁడో చూచినారా, నే నధికముగా మాటాడినచో నాపాపాత్ముఁడు నన్నెక్కడ నోరవేసుకొనునోయన్న భీతిచేత మఱేమియు మాటాడక, జీవహింసయు నందులో వరవధము నంతకంటెను ముఖ్యముగా బ్రహ్మహత్యయు పాపములని చెప్పువలెననినాలుక చివరకు వచ్చిననుబలవంతముగా నాపుకొని యూరకున్నాను.ఇప్పుడు లంకలోఁగూడరాజభక్తులనఁబడెడు విభీషణ పక్షమువారైన నవనాగరికులు కోందఱుబయలుదేరుచున్నన, మహాకాయుఁడు పూర్వాచార పరాయణులయిన శిష్టాగ్రగణ్యుల లోనివాఁడు ఈకధ సాగినకొలఁదిని లంకలోనున్నయిగు తెగలవారి చరిత్రములును గొంత కొంతవచ్చును గనుక ప్రస్తుతమా విషయుమును విడిచి పెట్టుచున్నాను.