పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

ఆదినము నా యజమానుఁడు మనస్సులో మిక్కిలి యుల్లాసముగా నున్నందున నానావిషయములను గూర్చి నాతో సల్లాపించుచు తన పెద్దల ప్రసంగము తెచ్చెను. అప్పుడు నేనందుకొని పూర్వచరిత్రమును తెలిసికొన వలెనన్న యభిలాషతో రామాయణము నందు వర్నింపబడిన రావణుని మంత్రి యైన మహాకాయుఁడు మీకేమి కావలెనని యడిగితిని. అతడు పయివంకజూచి వ్రేళ్ళుమడిచి లెక్కవేసి యాఁతడు తన వంశమునకు మూల పురుషుఁడగుటయు, చెప్పి వెచ్చమార్చెను. నేనును వ్రేళ్ళుమడిచి యుగ ప్రమాణమునుబట్టి రామరావణ యుద్ధము జరిగిన త్రేతాయుగము నుండి లెక్కవేసి, ద్వాపరయుగ ప్రమాణ సౌర సంవత్సరములు ౮౨౪౧౫ సంవత్సరములు రెండు మాసములని రాక్షసుల యాయుగప్రమాణమును నిణ౯యముచేసి, మీరు వెచ్చరూర్చిన కారణమేమని నాయజమాను నడిగితిని.

మహాకాయుఁడు- మాపెద్దల స్ధితిని దలఁచుకొని యిప్పటివారి యల్పాయుష్కతయు నల్పశక్తియు నల్పకాయత్వమును విచారింపఁగా దేశాభిమానము గలవారి మనస్సులో దుఃఖమెట్లు కలుగకుండును? సత్య-మీమాటాలు నాకు వింతగా నున్నవి. మహా- ఏమివింత? మాపూర్వుఁడొకఁడు భూమిని చాపగా చుట్టి చంకక్రింద పెట్టుకొని పరుగెత్తును కదా! ఆతని శక్తి ముందఱ నిప్పటివారి శక్తి యెంత? ఏదీ యిప్పడొక్కరిని భూమిని కాదుగదా, యీద్వీపమును చాపగాచుట్టుమను చూతము. పూర్వమొక మహాపురుషుఁడు సముద్రము మోకాలిబంటిగా తిరుగుచుండఁగా నాతని మేద