పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

మీఁది కొక్కదుముకు దుమికెను. నేనప్పుడు సమయోచిత బుద్దిగల వాఁడనయి ప్రక్కకు తొలఁగి తప్పించుకొని యమపాశముల వంటి నా బాహుపాశములను దానిమెడకు తగిలించి యుండనిక్షమున, వజ్రాయుధములవంటి దాని ముందఱి కాళ్ళగిట్టలు రెండును నాఱొమ్ముమీదఁ బడిప్రాణాపాయము చేయలేక పోయినను బలమయిన గాయమునై నఁజేసియుండును. అది మెడపట్టు వదల్చు కొనవలెనని పెనఁగులాడఁగా, పట్టువదలిన పక్షమున నన్నది కాళ్ళక్రింద నలగద్రొక్కునని నేను భల్లూకపు పట్టుపట్టి వదలకపోఁగా, అంతటమా యిరువురకును భారతయోధులకువలె ఘోరమయిన ద్వంద్వయుద్ధ మారంమయినది. బాహాబాహీని దంతాదంతిని సఖానఖిని నేనుజేసిన యామహాయుద్ధములో నేనక్షతశరీరుఁడనయి నాశత్రువును రెండుమూఁడుచోట్ల గాయవఱచి విజయోన్ముఖుఁడనయి యుండఁగా, ఆమేఁకపిల్ల ప్రాణరక్షణాథమయి కడపటి ప్రయత్నముచేసి పర్వతగుహలు మాఱు మ్రోయునట్లు మావుమని యొక్క సింహ నాదముచేసి తనబలమంతను ! అంతచేసినను నాపట్టు నేను విడువలేదు. అది రాక్షసభూమి యగుటచేత దేవతలు రావెఱచిరిగాని అరఱరంగమే మనపుణ్యభూమియైనపక్షమున పాశౌర్యవీర్యధైర్యములకు నామీఁద తప్పక దివినుండి సురలు విరులవానకురిసి యుందురు. నాశౌర్యకీతులను విద్యాధరకాంతలు దిగంతములయందు తమ నూతనగీతములతో గానముచేసియున్న పక్షమున, బ్రాహ్మణులు రణభీరువులని లోకములో నీవఱ కక్రమముగా వ్యాపించియున్న యవవాద మొక్కనిమిషముల పటాపంచలయి పోయియుండును. అయినను నాకంటెముందు భారత యుద్ధమునందు ద్రోణ క్రుపాశ్వత్థామాది బ్రాహ్మణోత్తములు చూపిన శౌర్యము వలననే యీ యపనింద కొంతవఱకు తొలగిపోయినది. ఆ సంగతి యటుండ