పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము లేదు. ఊరికే నీళ్ళు విదలుపుకొంగురు. మీఁద మయిలనీళ్ళు పడిస్నానము చేసినముండను చచ్చినట్టు చలిలో మరల మునుఁగుచున్నాను" అని గొణుఁగుకొనుచు లోతు నీళ్ళలోకి నడిచి బుడుగు బుడుగున నాలుగు ముణకలు వేసి బయలుదేఱి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెఱ్ఱచేసి చూచుచు "అమ్మలక్కలు క్రిందునుమీఁదను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడంట్రికములో ఇప్పుడు సహస్రాంశము లేదు. అత్తమందియు, వేముతీపునులేదు. ఎక్కడను అత్తలేని కోడలుత్తమురాలు. కోడలులేని యత్త గుణవంతురాలు" అని సణుగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్ళు మూఁడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరువాత మరల మూఁడుమాఱు లాత్మప్రదక్షిణములు చేసి మెట్లక్కియదృశ్యురాలయ్యెను.

శేషమ్మ- నాలుగు వంకలు ఁజూచి వడవడ వడఁకుచు" అమ్మలారా! నేనీలాగున అన్నానని మీరెవ్వరితోనైన ననెదురునుండీ!మా అత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును. ఈవఱకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగానే యుండవు. వెంకమ్మ తల్లి ! ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గోదావరిలో పడితేబాగుండునని తోఁచుచున్నది." అని వలవల నేడ్వఁజొచ్చెను.

వెంకమ్మ- "ఊరుకో! ఊరుకో! అటువంటి అవాచ్యములెప్పుడును పలుకరాదు. పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు." అని యూరడించుచున్నది.

శేషమ్మ- ఆ మాటలతో దుఃఖము మాని " గోదావరికి వచ్చిచాలసేపయినదమ్మా! ఇంతసే పేమిచేతుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను." అని వేగముగా నీళ్ళుముంచుకొని బిందె బుజముమీఁద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది.