పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/339

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము.

మొదటి ప్ర్రకరణములొ నేను జెప్పిన సత్యములను విన్నవారు నాసత్యసంధతను గూర్చి స్ంశయపడక పోయినను మనుష్యాశనుల దేశ మునకుఁబోయి వారిచేత భక్షింపఁబడక యిెక్క మనుష్యుఁడెట్లు మనకీ కథలను జెప్పుటకు జీవింపంవలినోయని యాశ్చర్యపడకపోరు. నేను రాక్షసులచే భక్షింపఁబడక పోవుటకుఁగారణము లవేకములు కలవు. అందు ప్రధానమయినది నే నాఁడుమతయాళములో నేర్చుకొన్న మంత్రమహిమ. రెండవది యిాకాలమునందు రాక్షసులు మనుష్య భక్షణమును మానుకొనుట."వ్యాఘ్రము లెప్పుడయిన మాంసాశనము మానివేయునా?స్వభావముచేత మర్త్యశనులయినదనుజులుమనుజ భోజనముత్యజించుట యిెతట్లుసంభవించును?ఈవార్త నమ్మదగియుండ లేదు". అని మనకర్మ జ్యేష్తులయిన శ్రోత్రియలొక వేళ నామాటలు పూర్యపక్షముచేయఁ జూడవచ్చును. అయినను సత్యమెప్పుడును. గాని నానోటినుండి మాత్ర మసత్య మెప్పుడును రాదు నేను సూర్యఁడు పశ్చిమమున నుదయించి దక్షిణమున నస్తమించునన్నను నామాట సత్యముకావలసినదే. నాయధార్ధమును పరీక్షించుటకయి మిాలో నెవ్వరయిన నీదేశమున కొక్కసారి నావెంట వచ్చినషమున మికు నా సత్యవాక్యధురీణత బట్ట బయలగును.దానవులుమానవాశనతను మానుటకును కారణములేక పోలేదు.దానికిని రెండు కారణములు న్నవి.అందొకటి మనుష్యులు క్రమక్రమముగా హ్రస్వశరీరులగుచు వచ్చుట చేత నెందఱిని భక్షించినను నొక్క ముద్దకయినన చాలక పోవుట.రెండవది విభీషణుఁడు లంకాధిపత్యము వహించి రాక్ష సరాజయిన