పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిట్టును. పలచగా(జల్లిన "నీళ్ళకు కఱవువచ్చినట్లు వేణ్నీల్లేచల్లినావుకా"వని తిట్టును. అడిగినమాటలకు మాఱు చెప్పిన"నామాట కెదురు చెప్పుచున్నావా" యని కోసి పెట్టును. బదులు చెప్పక యూరకున్న"మొద్దులాగున మాటాడవె"మని తిట్టును. ఆమెముందఱ ఏమి చేసినను తప్పిదమే. "ఆ" అన్న అపరాధము "నారాయణా" అన్న బూతుమాట. నేను కాపురనకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ నాలుగుదినముల క్రింద పగిలి పోయినప్పుడు రాయివంటి క్రొత్తకుండ పగులగొట్టినా వని నేటివరకు తిట్టుచున్నది".

పొట్టి-"అత్త పోగొట్టినది అడుగోటికుండ, కోడలు పోఁగొట్టినది క్రొత్తకుండ" యన్న సామెతవినలేదా?

శేష- నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు? నావిధవవదినగారు బ్రతికియున్నప్పుడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో -దైవము కడుపుచల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూడుపూటలును కడుపునకింత తన్నగా అన్నము నైన దినుచున్నాను. ఆడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్నమాట చుప్పవలెను. ఎన్నియన్నను ఇప్పుడు నాఅత్తగారు అన్నము తిన్నగాతినవైతివని తిటునుగాని తినిపోతినని తిట్టదు.

పొట్టిది-"లోకములో నెటువంటివారును లేకున్న - పిండిబొమ్మను జేసి పీఁటమీఁదఁబెట్టిన, ఆఁడుబిడ్డతనమున కదిరదరిపడ్డది-అన్నసామెత యూరకేపుట్టినదా?"

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంతదూరము వచి చెంబులోనీళ్ళు పాఱఁబోసి మీకు మాటలసందడిలో కన్నులు కనఁబడునా? ఈవల స్నానముచేసినవారున్నారని యయిన