పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు



పూజింపవలసినవా రగుదురుగదా? ఓ చదువరులారా ! మన దేశమునకు నేను సంపాదించిన యీకీర్తి తో మీరు కొంతకాలము వరఱకు త్రప్తిపొందియుండుఁడు.

పరదేశయాత్ర త్వరితముగా నెరవేర్చ వలేనన్న బుద్ధితో నేనొంటిగా రంఢీనగర ప్రాంతము నందలి యరణ్యమునకుఁ బోయి నా యజమానురాలి తల్లి యుపదేశించిన మంత్రమును పునశ్చరణము చేయుచుండఁగా ఒకసిద్ధుఁ డాక్షస్మికముగా నాకాశము నుండిదిగి నాయెదుట నిలిచెను. నేనామహాత్మునకు భక్తి పూర్వకముగా నమస్కారము చేసి చేతులుజోడించు కొని నిలువఁ బడితని. ఆ అసిద్ధాంద్రుఁడను తానేయనియు, మంత్రసిద్ధి చిరకాలమునకు ఁగాని కాదని దివ్యజ్ఞానముచే నెఱిగి నాకాపరసరియ్యవచ్చితి ననియు, చెప్పి యామూలిక పేరు కూడ నాకనుగ్రహించి యద్రశ్యుఁ డయ్యెను. ఆయోషధి పేరు దుత్తూరవర్ణి. దానియాకులు నల్లయుమ్మెత్తా కులవలెనుందును. పువ్వులు కొండ తంగేడు పువ్వులవలె నుండును. కాడలు కలువ కాడలవలె నుండును. ఆచెట్టు సమూలముగాఁ దెచ్చి నూఱి పసరుదీసి కాలికి రాచుకున్నయెడల మనము కోరిన చోటికెల్లను మనోవేగమునఁ బోవచ్చును. ఈ చెట్లు విశాఖపట్టణము లోని యల్లికొండమీదఁ గావల సినన్నియున్నవి. నేనాచెట్టుపసరఱకాలికి పూసికొని లంకాద్విపమునకుఁ బోవలేనని మనస్సులో సంకల్పించు కొనఁగానే క్షణకాలములో నేసాలంక జేరితిని . ఈ ప్రయాణకథ మొదలగు వానిని గూర్చి మీకుముందు తెలిపెదను. నేను బయలు దేఱిన దినముతో రంఢీ దేశమనందు మూఁడు సంవత్సరములు రెండు మాసములు పందొమ్మిది దినములుంటిని.



}}