పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

 
"ఇప్పుడును మరల గురుప్రభావము చేతనే పొమ్ము."

"ఇప్పుడు దారిచూపుటకు మాగురువిక్కడలేఁడు."

"గురువునై దారిచూపుటకు నేనిక్కడనున్నాను. నాయుపదేశము గైకొమ్ము. నీవు శీఘ్రముగా పోనియెడల, నిన్నిచ్చటివారు తప్పక చంపివేయురు."

అని నాకామె యెకమంత్రము యుపదేశించి యీమంత్రమును మూఁడులక్షలు జపముచేసిన యెడల సిద్ధియగుననియు, అప్పుడా మంత్ర ప్రభావముచేత కోరిన దేశమునకు పోయి వాలవచ్చు ననియు, చెప్పెను. నెల దినములకు నేను పూర్ణముగా స్వస్తుఁడనయిన మరల నెప్పటియట్ల వీధిలో తిరుగ సాగితిని. తరువాత వైద్యశాల వారు నాకు బలమైన ఘాతకలిగినట్లు విముక్తి పత్రము నిచ్చిపంపి వేసిరి. నేను మరల వచ్చి ఫాంఢీభంగీగారి లోపలఁ బ్రవేశించితిని. నేను వీధిలో బయలు వెడలునప్పుడెల్లను స్త్రీలు నన్ను వ్రేలితోఁజూపి యెగతాళిఁ జేయుచు, వీని నీసారి ప్రాణములతో విడువగూడదని తమలో ననుకొనుచు, నన్నుఁజూచి నవ్వసాగిరి. స్త్రీలకు స్వాతంత్ర్యమున్నయెడల నెట్టికీడులుమూడునో కనిపెట్టితిరా? " నస్ర్తీస్వాతంత్ర్యమర్హతి" యని చెప్పిన మనశాస్త్రకారుఁడు వెఱ్ఱివాఁడు కాఁడు. సామాన్యులు కనిపెట్టలేరుకాని సర్వజ్ఞఉలైన మన పూర్వులేంతటి బుద్ధిమంతులైననౌతురు. మన దేశమునందు మాత్రము మనమెన్నఁడును పురుషనామము భూమి మీద హ్నున్నంతవరుకు స్ర్తీలకు స్వాతంత్ర్యమణుమాత్ర్రము రానియ్యఁ గూడదు.

అప్పుడు నాకాదేశము విడిచి శాఘ్రముగా పోవలేనన్న బుద్ధిపుట్టినది. ఇట్లు చెప్పఁగానే మీరు ననదేశమునందలి యాఁడు వారికివెఱచి పాఱిపోవుచున్న భీరునిగా భావింతురేమో! మీరట్లెంతమాత్రమును తలఁపఁగూడదు. మహా భారత యోధుల జన్మభూమియైన భరత