పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బురుషునిబెట్టుకొన్నారు. అందులోను మద్యపానముగలదు; మాంసభక్షణముగలదు; సంభోగముగలదు; ముద్రలుగలవు. వీనినన్నిటిని బట్టిచూడఁగా వారుతమ శాస్త్రమును మనయాగమ తంత్రముల నుండి దొంగిలించుకొన్నట్టు తోఁచుచున్నది. మనముద్రలలో నెల్లనుబ్రధానమైన "హ" అను ప్రసాదముద్రను శ్రీచక్రమునువారు తీసికొన్నందున వారు తమమతము నంతను మనపంచమామ్నాయమయిన తంత్రము నుండియే తస్కరించి రనుటనిశ్చయము. అప్పుడువచ్చిన నయాజగద్గురువుల వారికి ముప్పది సంవత్సరముల వయ్యస్సుగలదు; ఆదేవిగారురూపము చేతనుచక్కని వారనియే చెప్పవచ్చును; ఆమె ప్రతిదినమును జంఢాపూజ చేయుదురు. ఈయుపాసనము స్త్రీకిబదులుగా బురుషుని బెట్టినయెడల, సమస్త విషయములలోను మనదేశములో వీరులనఁబడెడు మహా భక్తాగ్రేసరులు చేసెడి యుపాసనముతో సరిపోలును గనుకుమీకు తేటగాతెలియుటకయి మనదానినిక్కడ ప్రమాణవచనపూర్వకముగా కొంచెము వివరించెదను. శాక్తేయాచారముల లోని దయినయిది వామాచారము; దీనినాచరించు వారు కౌలికులనఁ బడుదురు. కౌలికులనగా నుత్తమ కులీనులని యర్ధము. ఈపదము చేతనే వీరిశ్రేష్ఠత్వము వెల్లడియగుచున్నను ప్రమాణ వాదులయిన మీతృప్తికొఱకు పరమప్రమాణమయిన శ్యామారహస్య తంత్రమునుండి వామాచారముయొక్కయు కౌలసిద్ధాంతము యొక్క యుసర్వోత్కృష్టతము స్థాపించు ప్రమణముల నిందుదాహరించెదను:-

శ్లో.సర్వేభ్యశ్చోత్తమావేదావేదేభ్యోవైష్ణవంపరం
 వైష్ణవాదుత్తమంశైవంశైవాద్దక్షిణముత్తమం
 దక్షిణాదుత్తమం వామణ్వామాత్సిద్ధాంతముత్తమం
 సిద్ధాంతాదుత్తమంకౌలంకౌలాత్పరతరంనహి.

"అన్నిటిలోనువేదములుత్తమములు; వేదములుకన్న వైష్ణవముత్తమము;వైష్ణముకన్న శైవముత్తమము; శైవముకన్న దక్షి