పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంతులైన మీకు వేఱుగఁదెలుపువలసినదేమున్నది? మీకిప్పుడుపేరును జెప్పనుగాని దివ్యజ్ఞాన సమాజమువారి మహాత్ములలోనివాఁడే యొక మహానుభావుఁడునేఁటివఱకును మన భరతఖండములో జరుగుచున్న సువార్తల నెప్పటికప్పుడుతెచ్చి నాకనుగ్రహించుచున్నాఁడనిమాత్రము మీసంశయ నివారణార్ధము చెప్పుచున్నాను.ఈ సంభాషణమయిన తరువాత మేము పాఠశాలనువిడిచి ఇంటికిఁబోతిమి.

అటుతరువాత రంఢీనగరములో పూర్వమెప్పుడునులేని పురుషవిద్యాభ్యాసమును క్రొత్తగానెలకొల్పుచున్న విషయమయివిద్యాంసువండ్రందఱునుజేరి సభలు చేయుట కారంభించిరి.ఆసభలలో పూర్వాచార విరుద్ధమగా పురుషులకు విద్యచెప్పించువారిని, అటువంటివారికి తోడ్పడువారిని, అందఱిని వెలివేసి మతగురువులకు వ్రాసి బహిష్కారపత్రికలు తెప్పించుటకు నిశ్చయింపఁబడినది. ఈసంక్షోభమునకు భయపడి నామిత్రుఁడయిన భాడీఫోడ్ అప్పగారతనినిబడి మాన్పించినందున మాపాఠశాలకెల్ల నేనొక్కఁడనే విద్యార్ధినైనాను.నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు మాత్రము జడియక ధైర్యమువహించినన్నుపాఠశాలకు పంపుట మాననందున, సభాపత్నులును పౌరమహా కాంతలును జేరిసభవారామెను బహిష్కారముచేసిరి.అటు తరువాత జరిగిన చర్యను మఱియొక ప్రకరణమునందు వివరించెదను.

ఏడవ ప్రకరణము

బహిష్కారపత్రిక వచ్చినతరువాత ఫాంఢీభంగీగారు తమప్రయత్నమును విడువక తమ మిత్రురాండ్రను రాజకీయ పాఠశాలలోని పయితరగతుల యందుఁజదువుకొను బాలికలను పోగుచేసి పురుష విద్యాభ్యాసముయొక్క యావశ్యకమును గూర్చి యుపన్యాసములుచేయుట