పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరమున ౩౩౭ గురును, ౧౦౨౮ వ సంవత్సరమున ౩౦౯ గురును, మహాపతివ్రతలు చిత్యారోహణముచేసి పదునలుగురింద్రుల కాలమువఱకును భర్తలతోఁగలిసి స్వర్గలోకసుఖమును భవించుటకుఁబోయిరి. 'దైవము దోసకారులకె తోడయివచ్చూ నన్న నన్నుతోక్తిప్రకారముగా పతభ్రష్టుల కృషిననుసరించి ౧౮౨౮ వ సంవర్సమునందప్పటి పరిపాలకులయిన బెంటింకు ప్రభుబుగారు సహగమనమునుమాన్పి ప్రతి సంవత్సరమును అంతమంది పతివ్రతలు పుణ్యలోకములకు పోకుండనిరోధించిన పుణ్యమును కట్టుకొనెను.

" మా దేశములో ౧౮౮౧ వ సంవర్సమునందు ప్రభుత్వము వారు వేయించిన జనపరిగణనప్రకారముగా స్వదేశప్రభువుల సంస్థానములలోఁగాక యింగ్లీషు రాష్త్రములో౨౦౯౩౮౬౨౬ గురు వితంతువులున్నారు.ఈసంఖ్యవలన మొత్తముమీఁద మాదేశములో నయిదుగురేసిస్త్రీల కొక్కొక్క వితంతువున్నట్టు కానఁబడుచున్నది. ఇఁక బ్రాహ్మణులలోనన్ననోముగ్గురాఁడువారిలోనొక్కతెవిధవగానున్నది."

ఈవిధముగా నేను చెప్పినసంగతి విన్నతరువాత౧౮౭౯ వ సంవత్సరములోనే భరతఖండమును విడిచిపోయిననాకు ౧౮౮౧ వ సంవత్సరములో హిందూదేశమునందు దొరతనమువారు వేయించిన జనసంఖ్యను గూర్చి యెట్లుతెలిసెనని నాసత్యచరిత్రమును జదివెడివారిఁలోగొందఱికి సందేహము కలుగవచ్చును.దానికి సర్వజన సమాదరణీయమయిన సమాధానమును చెప్పెదనువినుఁడు.నేనీ౦౮౮౧ వ సంవత్సరమునందు రండీదేశములోనున్నమాట వాస్తవమే. అయినను ౧౮౮౦ వ సంవత్సరమునందు భరతఖండములో మొట్టమొదట బొంబయినగరములో దివ్యజ్ఞాన సమాజము స్థాపింపఁబడుటయు, అప్పుటినుండియు కూటుహూమీ మొదలైన మహాత్ములు దూరదేశవాతలను తెచ్చుచుండుతయు, మీరందఱు నెఱిఁగియేయున్నారుగదా? అట్టిసంగతిలో బుద్ధి