పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"శ్లో.యాచభర్తృపరా నిత్యంస్తూయమానాప్పరోగణైః క్రీడతేపతినాసార్ధం యావదింద్రాశ్చతుర్దశ."

అనియు, ప్రమాణములున్నవనియు, ప్రమాణబద్ధులమయిన మనము శాస్త్రతిరస్కారము చేఁయగూడదనియు, నేనెంతవాదించినను నామాటలయందు గౌరవముంచక మూర్ఖుఁడయి యతఁడు సర్వకారుణ్యుఁడయిన యీశ్వరుఁడిట్టిక్రూరకృత్యమును విధించియుండడఁనియు, ఇదియంతయు వితంతువుల ధన మపహరింపఁగోరియోమఱియెందుచేతనో స్వప్రయోజన పరులయినవారు చేసినమోసమనియు, యుక్తికినినీతికిని విరుద్ధముగానున్న శాస్త్రనులను నమ్మరాదనియు, ఆతఁడేవేవోకుయుక్తులను పన్నుటకారంభిచెను.ఆమాటలకు నేను చెవులుమూసికొని హరినామస్మరణ చేసికొని శాస్త్రవిశ్వాసములేని నాస్తికులతో సంభాషించినచో దోషమువచ్చునని యెంచియాప్రసంగము నంతటితో చాలించితిని.

అతఁడుమాత్రము సహగమన విషయము నంతటితో విడువక నాకనిష్టముగా నుండునని దానిని దూషించుటమాత్రము మానివేసి"సహగమనమును దొరతనమువారు మాన్పుటకు పూర్వముమీదేశములో సంవత్సరమునకెన్ని యనుగమనములు జరగుచువచ్చె" ననియు, "ఇప్పుడు మీదేశములో నెందఱువితంతువు లున్నారు" అనియు, నానావిధములయిన ప్రశ్నలువేయ మొదలుపెట్టెను.నాకువిద్యాగురువుగానున్న పెదామనుష్యుఁడడిగినదానికి ప్రత్యుత్తరము చెప్పకుండుట మూర్ఖతగా నుండుననియెంచి నాకు తెలిసినంతవఱ కాతఁడడిగిన ప్రశ్నల కన్నిటికినినేనిట్లుత్తరములను చేప్పితిని:-

"మా దేశములో సహగమన సదాచారమును మాన్పుటకయి మొట్టమొదట మాతాంతరులయిన కైస్తవమతాచార్యులు క్రీస్తుశకము ౧౮౦౪ న సంవత్సరమున కలకత్తానగరమునందు క్రొత్త ప్రయత్నము