పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీదపోసి మొక్కిపోవుచువచ్చిరి . పాఠశాలకు పోవువేళ మించుచున్నదని యాస్ధలమును విడిచి నామిత్రుడును నేనును దారిపొడుగునను సహగమన విషయమై మాటాడుకొనుచు వేగముగా నంతట పాఠశాలకుబోయితిమి. ఆదేశములోనే బదియేంద్లు దాటీనతరువాతగాని పురుషుడు సహగమనము చేయరాదట. ఏబదియేండ్ల ప్రాయమునఱకును పత్నితో గాపురము చేసిన పురుషు డా దేశములో పుణ్యపురుషుడన బడును. అట్టి పుణ్యపురుషుడు పత్నీమరణ సమయము నందు సహగమనము చేసినపక్షమున ముప్పదిమూడు తరముల వఱకును తన తల్లి వంక వారిని తండ్రివంక వారిని మాత్రమే కాక తనపత్నియొక్క తల్లివంక వారిని తండ్రివంక వారినిగూడ తరింప జేసి మహాసావులను సహితము పుణ్యలోకమునకు బంపునట. ఆదేశమునందుశవములను పాతి పెట్టుటయేకాని దహనము చేయుటలేదు. సమాధియందు దంపతులను బోరగిల పరుండపెట్టుటకు కారణా మేమయిన నున్నదాయని నామిత్రుని నడిగినాను . పుణ్యలోకములు క్రిందిదట్టున నుండును గనుక వారియత్మలు తిన్నగా నడుగవంక పోవుటకయి యట్లు చేయుదురని యాతడుత్తరముచెప్పెను. పుణ్యలోకములు పయినుండుటచే నూధ్వలోకము లనబడుననియు, పాపలోకములు క్రిందనుండుటచే నదోలోకములనబడుననియు మనశాస్త్రములు చెప్పుచున్నవి. ఆదేశమువారు శాస్త్రవిరుద్ధముగా పుణ్యలోకములే క్రిందనుండు ననుచున్నారు. పుణ్యపాపశబ్దముల ప్రయోగమెట్లున్నను వారీప్రకారముగా సమస్తవిష్యములలోను పురుషుల నన్యాయము చేయుటచేత వారధోలోకములకేగుట నిశ్చయమని నేననుకొన్నాను. ఈ సహగమనమును వారి భాషలో భూతీఘీటీయందురు. స్వర్గ యాత్రయని దానికధనము. ఈసంభాషణ ముగియునప్పటికి మేముపాఠశాల చేరినాము. మాయుపాధ్యాయుడు చాలసేపటినుండి మానిమిత్తము వేచియుండి మేముపో