పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు కొంతకాలము నడిచినపిమ్మట మేమిద్దఱమును గలిసి యొకనాడు పాఠశాలకు బోవుచుండగా మాగములో నాకొక విచిత్రమును జూపెదనురమ్మని నామిత్రుడు నన్నూరి బయటికి దీసికొని పోయెను. ఆవఱకే వేడుక చూచుటకై స్త్రీలచ్చటికి తీధప్రజలవలె వచ్చియుందిరి. ఆగుంపులో నడుమనడుమ పత్నీవియోగము పొందని పుణ్యపురుషులను కొందఱుండిరి. ఆపట్టణములో గత దినము రాత్రి ధనికురాలయిన యొకవృద్ధవణిజస్త్రీ మృతినొందెను. ఆముసలి దాని భర్త మృతురాలయిన తనపత్నితో కూడ సహగమనము చేయుటకు నిశ్చయించి శ్మశానవాటికకు పోయినందున వినోదమును చూచుటకును పుణ్యమును సంపాదించుటకును వేలకొలది జనులక్కడ గూడిరి. మేము వెళ్లిన తరువాత ముసలిదానిశవమును నలుగురు మోసికొని పోయి యవఱకు త్రవ్వియుంచిన గోతిలో నిలువుగా బోరిగిల పరుండ బెట్టిరి. అంతట పురోహితస్త్రీలు మంత్రములు చదువుచు భర్తనుచేయి పట్టుకొని యాగోతి యొద్దకుగొనిపోగా అఱువదియేండ్ల ప్రాయముగల యాముసలివాడు తనశరీరమున నున్న రెండుమూడు నగలను దీసి చెంత పురుషులకు దానముచేసి సంతోషపూర్వకముగా సమాధిలోనికిదిగి పత్ని యొక్క కుడి ప్రక్కకు తానును బోరగిల పడియుండెను. అప్పుడు పూరోహిత స్త్రీలు మనదేశములో వేదఘోషచేసినట్లుగా గడీయనేవేవేవో మంత్రములు చదివి యేకర్మలు చేతుచుండిరి. ఈలోపలవన్నిద్దఱు స్త్రీలు పెద్దగంపల నిండా మన్ను పట్టుకొని గోతిచుట్టును నిలుచుండిరి. అప్ప్డు మహాధ్వనితో వాఅద్యములు మ్రోగు చుండెను. ఆసందడిలో ముఖ్యురాలయిన యాజకస్త్రీ యేదో మంత్రము చదివి చేయివిసరగానే యొక్క సారిగా ప్న్నిద్దఱు స్త్రీలును తమగంపల్లోని మన్ను మీదపోసిరి. అటు తరువాత పుణ్యపురుషులొక్కరొక్కరేవచ్చి తట్టెడుతట్టెడుమన్ను