పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/295

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చెను మన దేశమునందు స్త్రీల కెన్నినోములున్నవో యాదేశము నందు పురుషుల కంతకంటె రెట్టింపునోములున్నవి. వారాదివారమనాడు ప్రాతఃకాలము నందు కందపిలకను పూజింతురు; సాయంకాలమ నందు పెండలపు దుంపను పూజ చేయుదురు సోమవారమునాడు మధ్యాహ్నాము నన్నెకంటిని పూజింతురు. సాయంకాలము నందు రుబ్బురోటిని పూజ చేయుదురు. నడుమనడుమ వచ్చు విశేష వ్రతములుగాక యీ ప్రకారముగా దినమునకు రెండేసిచొప్పున పురుషులు సంవత్సరమున కేడువందల ముప్పదినోములు నోతురు. నామాన్యపురుషులన్ని నోములను నోచరుగాని యపత్నీకులను విత్తవంతులును విశేషముగా నోములను నోచి వాలతోకాలక్షేపము చేయుచు . తమని మును గురుతస్క రాచార్యులకు సమర్పించు చుందురు . మాసహధ్యాతుడున్ని నోములు నోచుచుండుట యప్పగారి కిష్టములేక పోయినను, అప్పగారికి తెలియకుండ నతడు బడిమాని యామె కొలువునకు పోయినతరువాత రహస్యముగా ముసలిదయిన తల్లి యొక్కయు ఇంటనున్న యితరపురుషులయొక్కయు ప్రోత్సాహముచేత నోములు నోచుచుండును. ఈనోములు నిష్పలములని నేనును మా యుపాధ్యాయుడయి చామర్జీగారునుకూడ పలుమాఱు నా మిత్రుడయిన భాఢీఫోడ్ కిబోధించుచువచ్చితిమిగాని యాతడు మావద్ద నాలోగుననేయని తలయుడించి నోములు మానివేసెదనని యొట్లుపెట్టుకొనుచువచ్చినను మము విడిచి యింటికి పోగానే యామాటలుమఱచి యధాప్రకారముగా ప్రవతించుచుండెను. ఎంత చదువుకొన్నను చిరకాలమునుండి వచుచున్న యాచారము నొక్కసారిగా మానుట యెంతటివారికిని కష్టసాధ్యముగా నుండును. అందుచేత నేనాతనిని ప్రతిదినమును పాఠశాలకితోడితెచ్చుటకయి యాతని యింటిమాగముననే పోయి యాతని నాతోపిలుచుకొనిపోవుచుంటిని .