పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వ దేశ యాత్రలు

పురుషు లీవలకువచ్చి వంట మొదలయి నపనులు చేయుదురు. దీనిని బట్టి యినుపుగదులలో పురుషులు పగలెల్లను సోమరులయి హాయిగా మహారాజులవలె నిద్రపోదురని మీరనుకొందురేమో మీయూహ సరియైనది కాదు. పరుండుటకాగదిలో రెండడుగుల వెడల్పును అయిదడుగుల పొడుగునుగల మంచ మొకటియున్నను, అందులోనే పిండి మొదలయినవి విసరుటకు తిరుగండ్లును కూరలుతరుగుటకు కత్తిపీటలను తక్కిన పనులు చేయుటకు తగిన సాధన సామాగ్రియు నుండును గనుక వారందు లోనే పనిపాటులుచేసి కావలిసినప్పుడు మంచముమీద వెన్ను వాల్తురు. ఈ యాచారముచేత రంఢీ దేశామునందు కుల పురుషులలో వ్యభిచారమన్న మాట లేదు. స్త్రీలకెప్పుడును పురుషుల మీద అనుమానము విస్తారమగుట చేత ఈపురుషుల మీదకూడ దోషారోపణములు చేయుదురు గాని నేను చూచినంతవఱకు పురుషుల కొక్కరికిని గర్భములు రాకపోవుటచత నేను వారిమాటలు నమ్మను. ఈపెట్టెలను చేయు స్త్రీలు మాఱుతాళము చెవులను చేసి తమయొద్దనుంచుకొని విశేషధనమును స్వీకరించి ధనికురాండ్రయిన యితర స్త్రీల కమ్ముదురురనియు, అందు మూలమున వ్యభిచారముజరుగుననియు అసూయగలవారు లేనినిందలు కట్టుదురు. ఇనుపపెట్టెలను కొనుటకు శక్తిలేనివారిరీతిగా కఱ్ఱపెట్టెలను చెయింతురు. అందుకును సమర్ధులుకాని వారుతమపతులను గదులలోనే పెట్టి తాళముచేసి దానితోనే తృప్తిపొందియుందురు. ఈ యాచారమును మనముతప్పక మనదేశములోకూడ స్ధాపింపవలెను . అనుభవజ్ఞుడైన నామాటవిని మీరీ పెట్టెల పద్దతిని మనదేశములో వ్యాపింపజేసి స్త్రీలనందుంచి తాళమువేయుచు వచ్చినపక్షమున, అత్యల్ప కాలములోనే మనభరతక్గండమునందు జారత్వము రూపుమాసి పోయి మనదేశమ్,ఉ మహాపవిత్రమయినదగును. ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుటకువీలుగలుగునుగనుక మనపెట్టెలకు మాత్రము గవాక్షములుం