పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళ యాళము

యందు దానికి "ఘోఢా" యని పేరు. అది మనదెశమునందలి ఘోషాపదములతో సమానమయినది. ఒక వేళ నది ఘోషాశద్దభవమై యుండును. వర్ణ వ్యత్యయవిధిని బట్టి తద్భవమునందు"షా" కు డా" రావచ్చును. దానిని నేను రాణివాసమునకు ప్రతిగ రాజవాసమని పిలిచెదను. మనదేశామునందలి స్త్రీలకు వలె రాణివాసము పండ్రేండవ యేట నారంభము గాక యా దేశము నందు పురుషులకు రాజవాసము పదునాఱవ యేట నారంభమగును. అక్కడి రాజవాసము మనరాణి వాసమువలె గాక మిక్కిలి విచిత్రమయినదిగా నుండును. సంస్ధానాధీశ్వరులును ధనికురాండ్రును మనమిక్కడ ధనమును మిత్తము చేయించినట్టుగా పెద్దయినుపపెట్టెలను చేయింతురు. ఒక్కొక్క పెట్టెయెత్తు ఏడదుగుల ఆఱంగుళములు; నిడివి యేడడుగుల మూడ్మ గుళములు వెడల్పు నాలుగడుగుల రెండంగుళములు. చుట్టును అమర్చిన యినుప రేకుదళసరి ముప్పాతిక అంగుళము. దానితలుపు రెండడుగుల వెడల్పును నాలుగడుగులఎత్తును కలదిగానుండును. ఈపెట్టెకు గాలివచ్చుటకును వెలుతురు వచ్చుటకును రెండువైపులను గోడలకు అడుగు చతురము గల రెండుగవాక్షములుండి వానికడ్డముగా ఇనుపకమ్ములు వేయబడి యుండును. ఈ రాజవాసమునందు పదునాఱు సంవత్సరములు వచ్చినది మొదలుకొని భాగ్యవంతుల పురుషులు పగలెల్లను నిర్బంధింప బడుదురు. ప్రాతఃకాలమున స్త్రీల భోజనము లగునప్పటికి తొమ్మిదిగంటలగును. తరువాత పదిగంటలకు లోపలభర్తల భొజనములు అగును . భర్తల భోజనములు కాగానే పత్నులు తమపురుషులను పయిన వర్ణింపబడిన రాజగృహముల యందు బెట్టితాళమువేసి తాళముచెవి తమయొద్దనుంచు కొని రాజకీయ కార్యస్ధానములు మొదలయినవానికి బోవుదురు. వారు మరల సాయంకాల మయిదుగంటల కింటికి వచ్చి తాళముతీయగా