పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి దుఃఖము బయలుదేఱగా గొంచె మాపుకొనుచు గన్నీరు పైట చెఱగుతో తుడుచుకొనుచు గొంచెము తాళి గద్గదస్వరముతో "మగనితో సౌఖ్యమనుభవింపనా? కాపురము చేయనా?" అని కొంచెము బిగ్గరగా నేడ్వజొచ్చెను.

రు - (ఆ మాటలు మనసుకు నాటి యొడలు పులకరింప గొంత తాళి ధైర్యము తెచ్చుకొని) "పెద్ద ముత్తైదువవు ఆలాగున గంట తడి పెట్టరాదు. ఊరుకో ఊరుకో రోగము మనుష్యులకు రాక మ్రాకులకు వచ్చున

పె - ఏడుపు చాలించి - "అమ్మాయీ! దానికే సౌఖ్యము నక్కఱలేదు. ఈలాగునైన నుండి బ్రతికి బట్టకట్టిన జాలును. మా ముసలి ప్రాణములు రెండును బ్రతికి బాగున్నంత వఱకు దానికి యన్నవస్త్రముల కేమియు లోపము రాదు."

రు - కొంచెము సేపేమేమో యాలోచించి - "సోమిదేవమ్మా! మీవారు గ్రామములొ పెద్ద సిద్ధాంతులు గదా? తెలిసి కూడ చిన్నదానికి అంత యర్ధాయుష్మంతున ... "

పె - మాటకడ్డము వచ్చి - "ఔనౌను! నీ వడుగబోవునది నేను గ్రహించినాను. ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండ మోయవలసిన వ్రాత యుండగా నెవరు తప్పింపగలరు? ఎవరైన జాతకము మంచిదిగా జూచి వివాహము జేయుదురు గాని పెండ్లి కుమారునకు లేని యాయువును తెచ్చి పోయగలరా?"

రు - "అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాబోలు!"

పె - కొంచెమనుమానించి - "పూర్ణాయుస్సా? అవును పూర్ణాయుసే యున్నది. జాతక ప్రకారము జరగదా అందునేమో,