Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళ యాళము

కార్యములలో వేశ్యలను పాటలకు పిలుచునట్లగా వీరిని శుభకార్యములకు పిలువరు. మన దేవదాసులవలెవీరు దేవాలయముల యందును గానరారు. గృహదేవతలవలె నుండెదు వీరికి గృహములే దేవాలయములు, వీరే యందుండెడు దేవతలు. ఈదేవతాస్ందర్శనము నిమిత్తమయియే ధనవంతురాండ్రయిన స్త్రీలు వాఋఈ యాలయ మలకు బోయి తమదేహములను విత్తములను వారికి సమర్పించి వారిప్రసాదమును వేడుచుందురు. దేవతాభక్తిగలవారు ధనాదులయందు వైరాగ్యముగలవా రగునట్లే యీదేవతలను సదా సేవించువారును నిస్పృహత్వముచేత ధనముకొల్ల పెట్టి తాము జొగులగుదురు. మనదేవతలకువలెనే యిభోగదేవతలకును పరభార్యలయందే సంతానప్రాప్తి. అయినను మనదేవతలకువలె అమృతత్వములేనివీరికి వంశాభివృద్ధి యెట్లో నాకు తెలిసినదికాదు. విశేషవిత్తమిచ్చి బీదల చక్కని బిడ్డలను గొని వీరు వాఅరిని చిన్నప్పటినుండియు భ్రమరకీట న్యాయముచేత మర్త్యత్వము నుండి దేవతాతత్వమునకు లేవదీయురట !


అక్కడ హితము వివాహములకు కన్యావరులయిష్ట మక్కఱలేదు. తల్లిదండ్రులే ముఖ్యముగా తల్లులే కన్యావరణము చేయుదురు. పురుషులు యుక్తవయస్సు వచ్చినతరువాత వవాహముచేసెడు పక్షమున కురూపిణు లయిన పత్నులను చేసికొన కంగీకరింపక తల్లిదండ్రులు చెప్పినమాటవినక తరస్కరింతురు గనుక పురుషులకు గురుధిక్కారదోషము కలుగకుండ జేయుటకయి చిన్నతనము లోనే వివాహములుచేయు సదాచారమును వారిధర్మశాస్త్రములు విధించుచున్నవని చెప్పుదురు. వారిధర్మశాస్త్రములబట్టి స్త్రీకి పదునాఱు సంవత్సరములకు లోపలగర్భాధానము చేయకూడదు. పదునెనిమిదవ సంవత్సరమునందు చేయుటా శ్రేష్ఠము. గర్భాధానము నాటికి పురుషున కిర్య్వది సంవత్సరముల వయస్సుండవలేను. పదునాఱేండ్ల ప్రాయముననే స్రీకి