పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాపూర్వదేశ యాత్రలు

యిన సంగీతము వారికడానే యుండుటాచేత సంగీతము పాడంరనేర్చిన కుల పురుషునిగాని స్త్రీనిగాని మిక్కిలి నీచముగాజూతురు. సంగీతము వృత్తిగాగల కుల స్త్రీలను పంక్త భోజనములకు రానియ్యరు. కామోద్రేకమును గలిగించెడు శ్రావ్యములైన పాటలను, సరసోక్తులను, వశ్యౌషధములను, వశీకరణములను, నేర్చుకొని భోగపురుషులు గడ్డములను మీసములను తలను దువ్వుకొని నానా విధములయిన యాభరణములతోను పుష్పములతోను శరీరము లలంకరించుకొని, చిత్రవణములుగల వత్రములను ధరించి, మొగములకు తళుకుతళుకు మనెడు వణమేదోవేసికొని, అత్తరుమొదలైన సుగంధద్రవ్యములను పూసికొని , తమ మేనితావుల వీధుల గుబులుకొనగా దీపములు పెట్టిన తరువాత రూపమునుధరిం చిన గృహదేవత లనునట్లుగా దీపములవెలుతురున తళుకుతళుక్కున మెఱయుచు, దారినిపోవు యువతుల హృదయములు సంచలించునట్లుగా ప్రతిదినమును తమగుమ్మములయో నిలుచుంది స్త్రీలు తారసించునప్పుడెల్లను సిగ్గుపడి లోపలికిపోయి తలిపిలచాటునుండి మొగమీవలికిపెట్టి తొంగితొంగి చూచుచుందురు. అటువంటి సౌందర్యముగల పురుషులు మనదేశమునందులేరు. మణులుచెక్కిన బంగరు బొమ్మవలవలె నిలువబడి భూమికి దిగిన మెఱుపుతీగవలె వారు దీపమువెలుతురున మెఱయుచున్నపూడు నావంటి పూరుషులకు సహితము పోయి పయినుబడి కౌగలింప వలెనని బుద్ధిపుట్టుచున్నప్పుదు యువతులు వారినిమోపించి వారివలలోబడుట యేమియశ్చర్యము ? య్రబదియేండ్లు దాటినవారు సహితము తెల్లపడిన వెండ్రుకలకు నల్లరంగువేసికొని యలంకరించుకొని పదునాఱేండ్లు బాలకుమారులవలే గానబడుదురు. అయినను మనదేశమునందు వివాహములు మొదలయిన శుభ