పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళ యాళము

తెచ్చినాను. విరూపు లగుటచేతనో యేమోకాని యీముక్కిడి పురుషులయం దక్కడ వ్యభిచార మెంతమాత్రమును గానబడదు. అట్లు లేకపోవుట కీనాసికా ఛేదనమే కారణ మగుట సందేహములేదు. పురుషులకు చేయుటచేత నిది దురాచారమయినను స్త్రీల విషయమయి జరిగించిన పక్షమున తప్పక సదాచారమే యగును. మన విత్ంతువుల కిట్లు ముక్కు కోసిన పక్షమున వారిలో వ్యభిచారము సమూలముగా నశించుననుటకు సందేహముండదు. ఇటువంటి సదాచారము మనస్మృతులలో నెక్కడ నైనను జెప్పబడి యాండకపోదు కాబట్టి యీయాచారమును మనము మనదేశమునందు తప్పక నెలకొల్పవలయును. నేను ధర్మశాస్త్రములను వదకి దీని కధారముగా కారిక నెందయినను కనిపెట్టెదను. యిప్పుడున్న స్మృతులలో దీని కాధార మొక వేళ దొరకపోయినను భిలస్మృతులయందయినను తప్పక యుండును గాని యుండకపోదు. ధర్మజ్ఞసమయముక్కొడా ప్రయాణమేగనుక మన పండితులందఱును వెంటనే సభచేసి శీఘ్రముగా నిట్టినిబంధనము నొక దాని నేర్పఱుప వయును.

ఆ దేశమునందు సహితము మనదేశామునందు వలెనే పత్నులు వయస్సున చిన్నవారుగాను, భతలు పెద్దవరుగాను ఉందురు. ఇష్ట మున్న యెడల స్త్రీ యనేక భర్తలను చేసికొనవచ్చునుగాని సంస్ధానాధీశ్వరులలో దక్క సాధారణముగా స్త్రీ లొక్కొక్క భర్తలతోనే తృప్తి పొందియుందురు. భర్తలు పుట్టునిండ్లకు వెళ్ళినప్పుడును, రోగాదికముచేత నశక్తులయి యుండి నప్పుడును, స్త్రీలు కామతురలయియున్న వారు భోగపురుషులుతొద్దకు పోదురు. పయి కారణములు రెండును లేక పోయినను ధనవంతురండ్రయిన స్త్రీలు భోగపురుషుల నుంచు కొందరు. ఈ భోగపురుషు లుగ్గుపాలనాటి నుండియు స్త్రీలను వలపించి తమవలలలో బడవేయదగిన వద్యలనభ్యసింతురు. హృదయరంజకమ