పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషులే యధికబలము గలవారని యామె సెలవిఛ్ఛినది . అప్పుడు మాయిద్దరికిని సంభషణ మిట్లుజరిగినది.

అమ్మా! స్త్రీ పురుషులలో పురషులే అధిక బలవంతులని మీరుసెలవిఛ్ఛుచున్నారుగదా‽ అట్లయిన పక్షమున, ఈదేశములో బలాధికులయిన పురుషులు బలహీనురాండ్రయిన స్త్రీ లకులోఁబడుట యొట్లు సంభవించినది‽ నా యీసంశయము తీర్పవలెను.

ఓయివెర్రివాఁడ! నీవేమియుతెలియని మూఢుఁడవుగదా పురుషులు స్త్రీలకు లోఁబడవలెననుట యీశ్వరోద్దేశము– (ఈశ్వేరుఁడమని పుంలింగ ప్రయోగము చేసినందుకు చదువరులు నన్ను మన్నింపవలెను. ఆదేశమునందు దేవుఁడాఁవాఁడనియే ప్రసిద్దము.ఆమె యీశ్వరియని యథ౯మిఛ్ఛునట్లుగా స్త్రీ లింగమునే ప్రయోగించినను మీకు తెలియుటకై నేనే యీశ్వరుఁడనుచున్నాను.) ౼బలవంతులుగనుక పురుషులు పొటుపడి పనిచేయుటకు ను, పత్నీసేవచేయుటకును, తగినవారు. అంతేకాని వారుస్త్రీలవలె ఆలోచనతో చేరిన పనులు చేయుటకుఁగాని గ్రంథరచన చేయుటకుఁగాని స్వభావముచేతనే తగరు. పురుషులు బలాధికులే కానిపక్షమున౼౼

మా దేశములో పురుషులు ఆలోచనతో చేరిన పనులు చేయుచు కవిత్వము చెప్పుచున్నారే౼

మధ్య నామాటల కడ్డమురాక నేను చెప్పెడిది సాంతముగావిని నీసంశయము పోఁగొట్టుకో. మీది కేవల రాక్షస సృష్టి. అందుచేతనే (నీమాటలునమ్మెడు పక్షమున) మీ దేశములో సర్వమును దేవతాసృష్టీ యోన మాదేశమునకు విపరీతముగా నున్నది. ఆసంగతి పోనిమ్ము. పురుషులు బలాదికులే కానిపక్షమున వారు పత్నులకు వంటచేయుటకును ఉపచారములు చేయుటకును, బరువులు మో యుటకును, ఎట్లు సధు౯లగుదురు ?