పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశములోని పురుషులనిమిత్తమై పాఠశాలలనుబెట్టి పురుష విద్య వ్యాపింపఁజేయవలెనని ప్రయత్నించుచున్నారుగాని గౌరవముగల కుటుంబములలోని మగపిల్ల లెవ్వరును బడికెక్కనందున వారిమనోరధమంతగా కొనసాగకున్నది. ప్రభుత్వమువారిప్పుడు పురుషుల నుపాధ్యాయులనుగా దిద్దుటకయి రాజధానిలో నొకపాఠశాలను క్రొత్తగాఁ బెట్టియున్నారు. దేశాచార విరుద్ధములయిన యిటువంటి కార్యములు చేయుచుండుట వలన దొరతనమువారియందు జనసామాన్యమున కనురాగము తక్కువగానున్నది. ఓ హిందూమహాజనులారా! ఇవియన్నియు మీ విజయమున కనుకూలనూచనలేకదా! నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు పురుషులకు విద్యచెప్పించి దేశమునకుఁ గ్రొత్తమార్పులను తేప్పింపఁగోరు తెగలోనివారు. తమ దేశములో పురుషులు చదువుటకును వ్రాయుటకును నేరనివారైయుండుట చేత తమభాషలోని పదములను నేను మన భాషలో వ్రాసికొనుచుండుట చూచి యితర దేశముల యందు పురుషులు వ్రాయనేర్చియుందురాయని నాయజమానురాలి కప్పుడత్యాశ్చర్యము కలిగినది. అప్పుడామె నామొగము వంకఁ జూచి నీవు మీ దేశములో భొగపురుషుఁడవాయని యడిగను. కాను కులపురుషుఁడనని నేను బదులు చేప్పితిని. ఆమె దొరతనమువారు నూతనముగాఁ బెట్టించిన పాఠశాల కెదిగిన పురుషుల నెవ్వరినైన సంపాదించవలెనని బహుదినములనుండి కృషిచేయుచు విఫల ప్రయత్నయయియుండి విద్యాభ్యాసము చేయుటకాసక్తి గలవాఁడనై యున్న నన్నుఁ జూచి సంతోషించి నన్నాపాఠశాలకుఁ బంపవలెనని యుద్దేశించుకొనెను. కొంతవఱకు భాషాభివృద్ది చేసినవారినిగాని యాపాఠశాలలోఁ జేర్చు కొనరుకనుక నాకింటికడ నిత్యమును రెండుగంటలసేపు విద్యచెప్పుటకెై భాంగీఫిండీయను పేరుగల యొక విద్యంసురాలిని నెల జీతమునుకుఁబెట్టెను. ఫీండీయను పదము మనదేశములోని శాస్త్రిపదముతో సమా