Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నేను (ఇది జ్యొతిశ్శాస్త్రము చేతఁ కాదు సాముద్రిక శాస్త్రము చేతనని మనస్సులో భవించుకొని): ఆయ్యా! నా రుపములో నేమి వింతయున్నది?

ఫాంఢీ: నీవు గడ్డమును మీసమును గొఱిగించుకొన్నందున నీ పత్ని పొయినదని తెలుసుకొన్నాను. ముక్కునందున నీ పత్ని నీవు మిక్కిలి బల్యములో నున్నప్పుడే మృతినొందెనని గ్రహించినాను. ఇంతకంటే నీరుపములో వింత యేమికావలెను?

మొట్టమొదట నాకీమాటలకర్థమైనది కాదుగాని తరువాత మాయజమనానులతో దీర్ఘ సంభాషణ చేసి వారి దేశము యెక్క స్థితిగతులను జనుల యొక్క యాచారవ్యవహారములను కొంత తెలిసికొన్న పిమ్మట నాకామాటల యర్ధము బోధపడి వారి దేశము మీద నా కెంతో కోపము వచ్చినది. అసమర్థుడు తన కోపమును వెలిపుచ్చుట వలన పరులకు హాని చేయుటకు మారుగా తానే హానిని పొందునని యెఱిఁగి నాకోపమును నా మనస్సులోనే యడఁచుకోవలసిన వాఁడనయితిని. నాకపుడాదేశామువిడిచి పాఱిపోవలెనన్న బుద్ధి పుట్టినది గాని పరులకు దాసుఁడైన యున్నందున నాకదియు సధ్యముగా కనఁబడలేదు. దైవ మేకలమున కేవ్వరినేమి చేయఁదలఁచునో యెరుఁగుట యెవ్వరికి శక్యమగును?

నేను జేసిన దీర్ఘ సంభాషణవలన నా యజమానుఁ డాకస్మికముగా యజమానిరాలయ్యెను; నేను జూచిన రాజభటులు మొదలైన పురుషు లందఱును స్త్రీలైపోయినారు. ఇ౦తవఱకు నేనూహించినట్లే యైనది కాని యీ దేశములో పురుషులు లేకపొవుటయు గాలికి బిడ్డలు పుట్టుటయు మాత్ర మబద్దములై పొయినవి. ఆ దేశమూలోను పురుషులున్నారు కాని, వారున్నను లేనట్టే భావింపవలసియున్నది. అక్కడయజమాన్యమంతయు స్త్రీలది. రాజ్యపరిపాలనము చేయువారు