పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనస్సునకుఁ దగులఁగానే నేను జూచిన వారందఱును స్త్రీలే యనియు, ఈదేశమునందుఁ బురుషులు లేరనియు, గాలికే బిడ్దలు పుట్టుదురనియు, స్త్రీ మళయాళమును గూర్చి మనవారు చెప్పినదంతయు సత్యమేయనియు, నేను నిశ్చయించుకొంటిని. నామనస్సులో నీయాలోచన ముగియునపటికి మెముక్కయిల్లుచేరితిమి. ఆయింటి గుమ్మము వద్దను లోపలనుగూడ నన్నుఁదీసికొసివచ్చిన వారెవంటివేషములు ధరించుకొన్న పేడిమూతి రాజభట్టు లనేకులుండిరి. మొదటి యిద్దఱు రాజ భటులును నన్నులొపలకిఁ గొనిపోఁగా లొపలివారందఱును గుంపులుగుంపులుగా వచ్చి యడవి మృగమును జూచ్చినట్తుగా నన్ను తేఱిపాఱఁజూడసాగిరి. అంతట వారిలో వారెమో యాలొచించుకొని నన్ను దురముగాఁ దీసికొని పొయి మూలగాన్నున యెుక కొట్టులోఁబెట్టి పయిని తలుపు వేసిరి. అంతట రాజభటులు కొంద ఱొకరు విడిచి యెుకరు తలుపు వద్దకువచ్చి దానికి నిలువుగా వేయబడిన యినుప కమ్ముల సందు నుండి బోనులోనున్న యడవి జంతువును జూచ్చినట్లుగా నన్ను తొంగి తొంగి చూచుచు నావలకుఁ బోవుచువచ్చరి. ఇట్లువచ్చుచుఁ బోవుచుంటయు వారిలో నేమోయాలోచించుచుకొనుచుంటయు చూడగా మన దేశములోని పోలిసుభటులు సంగతి నాకు జ్ఞప్తికి వచ్చి వారికేదో దురుద్దేశముకలినట్టు నాకు పొడకట్టినది. కాని నేను స్త్రీనిగాక పురుషుఁడనయినందున అట్టియనుమానముతోఁ బనిలేదని మనస్సమాధానము చేసికొంటిని. ఈరీతిగా రాజభటులులలో నేదో యాలోచన జరుగుచుండఁగా నింతలో వారి యజమానుఁడక్కడకు వచ్చెను. ఆతనిని దూరము నుండిచూచి వారందరను తమతమ యధాస్థనములకు బోయిరి. అటు తరువాత నతఁడు తనపనిని చేసికొని, తాను మొదట వచ్చినప్పుడు నాకొట్టుముందు భటులు గుంపుగూడి పరిగెత్తిపోవుట కనిపెట్టినవాఁడగుటచేత నందేదో వింత యున్నదని యూహించి, నాకొట్టువద్ద కువచ్చి తలుపుతీయించి, రాజభటులు