పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము

భూభే?" అని యేదో ప్రశ్న వేసినట్లు పలికెను. నాకామాట ఆర్ధమయినదికాదు. అయినను పెద్దమనుష్యుఁదేదోయడిగినప్పుడు ప్రత్యుత్తరము చేపకుండుట ధర్మముకాదని తలఁచి అతఁడు నాపేరెవరని యడిగియుఁడని యూహించి, తెలుఁగు భాషలలో "నా పేరు సత్యరాజాచార్యులు" అని చేప్పితిని. వాఁడు కోంచము సేపాలోచించి మరల భిగ్గరగా "తూమిభూబే" అని పలికెను. నేను వానికిఁదెనుఁగు తెలియదనిగ్రహించి, హిందూస్థానీ బాష సమస్త దెశములలోను దెలియునుగదా యనినేను విజయనగరములో మహారాజుగారి వెంట కాశీనగరమునకు వెళీవచ్చిన వారితోడి సహావాసమునుబట్టి మాటాడ నెర్చుకోన యాభాషతో "మేరానాం సత్యరాజాచార్" అని చెప్పితిని. వాఁడామాటను సహిపము గ్రహింపక "తూమిభూభే" అని మరల మరింత బిగ్గరగా నఱచెను. అందుమిఁద నేను వానికీభాష తెలియకపోయినను ఈకాలమునందు సర్వత్ర వ్యాపించియున్న యింగ్లిషయినను దెలిసియుండునని "మైనేం ఈజ్ సత్యరాజాచార్య" అని చెప్పితిని. వాఁడాభాషను సహితము తెలిసుకోలేక కోపముతో మరల నెప్పటిప్రశ్లనే బేసెను. ఆఏయిని నాకేమి చేయుటకును తోఁచక దేశభాషలు తెలియకపోయినను బేవభాష తెలియునేమోయని సంస్కృతముతో "అహం సత్య రాజాసార్యనామక విప్రః" అని స్పష్టముగాఁ జెప్పితిని. ఆమూర్ఖుఁడదియును తెలిసికోలేక రెండవవాని కేసి తిరగి యేదో భాషతో ననెను. ప్రసిద్ధమయిన నాపేరుఁ దెలియఁబఱుపకుండుట నాకిష్టిములేకయఱవదీఅశమునకు సమీపముననుండుటచేత ద్రావిడభాషయైనను దెలియునేమోయని "ఎన్ పేర్ సత్యరాజాచారిన్” అని చెప్పితిని. ఈయఱవములోఁదప్పున్నయొడల దీనింజదివెడి యఱవవారు నన్ను మన్నింపవలెను. నేనువెనుక పొగ బండిలో యాత్రచేయునప్పుడు నాలుగఱవ ముక్కలు మాబ్రాహ్మణుని వలన నేర్చకొన్నాను. కాఁబట్టి యాతనిచేతిలోఁబడ