Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

అప్పుడునేనిలేచి కొంచము దూరమునడచి యొకచెట్టునీడను గూర్చు ండి యేవంకకుఁ బోదునాయని యాలోచించు చుండఁగా, తూర్పువైపునుండి రెండు విగ్రహములు నావంకకు నడచి వచినవి. ఆవఛ్ఛినవారు పురుషులయి యుందురా స్త్రీలయియుందు రాయని నామనస్సునకప్పుడొక గొప్ప సందేహము తోఁచినది. వారిమొగములు చూడఁగా నించుమించుగావారు ముప్పదిసంవత్సరములు ప్రాయము కలవారుగాఁ గానఁబడిరి . వారిమూతులకు గడ్డములుగాని మీసములుగానిలేవు.దీనినిబట్టవారు క్రొత్తగా క్షురకర్మచేయించుకొనిరని మీరుభావింపఁకూడదు. మన స్త్రీలకువలెనే వారికినిమొగములమీఁద గడ్డములును మీసములును భగవంతుఁడే ప్రసాదించలేదు. నారిద్దఱును చామనచాయగలిగి, పొడవునందున కంటె పిడికెడెక్కువగానుండిరి. వారికాభరణములేవియు లేవు,· మొగమునబొట్లులేవు". కింటఁగాటుక లేదు·ఏకరీతిగా వారిరువురును నిడుదలైన నల్లని లాగులును, ఎఱనికుఱుచ చొక్కాలను,తలలకు గడ్డితోనల్లిన తెల్లకుళ్ళాయలును ధరించిరి; కాళ్ళకు చెప్పులు తొడుగుకొనిరి. వారినడుముచుట్టును పట్టుదట్టీలు బిగింపఁబడి యున్నవి. పట్టుదట్టిలకు ముందువైపున నేనోయక్తరములు చేక్కిన యిత్తడిబిళ్ళలున్నవి. వారిచేతులలోతెందేసిమూరల పోడవుగల గండ్రనిరెండు విరుగుదు చెవకగ్రలునవి. ఈలక్షణములు ననిటినిబట్టి వారెవ్వరో రాజభటులనియు వారు మొట్ట మొదట నాతోనేమియు మాటదక, వయస్సులొనునన్న క్రొత్తస్రి యెవ్వతెయైనను వీది కనఁబదినప్పుడు మనదేశములో పురుషులు దానియెగము వంకనెగదిగా చూచున్నట్టుగనే వారును నాముగమువంక చూచి, తమలోనేమో మెల్లగా గుసగుసలాడుకొని తరువాత వారిలొ నోకఁడు నాసమీపమునకువచ్చి తూమీ