పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/262

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మనియుఁ దెలిసియుండవచును అటుపిమ్మట చీఁకటిపడిన తరువాత రాత్రి రెఁడుయామములవఱకును భూమిలోపల నడిమిభాగమునందున్న మహావాయుపథములో దేవతా విమానమువలె దిశదిశలకును నూఱు యోజనములు పరచిపిమ్మట మఱియొక గుహాముఖమునందు నేను నా పరుపుతో గూడ వాలితిని. అటుతరువాత నా పరుపు వెనుకటివలెనే పయికి మెల్లగా జాఱనారంభించితిని. ఆ పిమ్మట భగవన్మాయచేత పరుపాకస్మికంగానదృశ్యమైనది. అప్పుడక్కడ నుండి నేను వెనుకటియట్లే పయికి పడ మొదలుపెట్టితిని. అట్లుకొంతిదూరము పడినతరువాత నా శరీరమునకు దుస్సహమయిన వేఁడిసోఁకినది. ఆవేఁడి యంతకింతకు తక్కువగచువఛ్ఛి నేను యోజనదూరము పడునప్పటికి నాకాలికి గట్టిగా నేలతగిలినది. ఆ నేలమీఁద కొంచముదూరమునడచి నేను గుహలోనుండి పయికి వఛ్ఛి భూమిమీఁద నేనింతకుముందుచిప్పిన రాతిమీఁద పరుండునప్పటికి, తెల్లవాఱి సూర్యోదయమయినది.ఇంతలో నాకాస్వప్నముపోయి మెలఁకువవఛ్ఛినది. ఆడుమళయాళమునకి దియే సరియైనదారి. ఓధీమంతులారా! ఇది కలయని భ్రమపడి దీనిసత్యమునుగుఱించి మీరొకవేళ సంశయ పడెదరుసుండీ ! అటు సంశయపడఁగూడదు.ప్రమాణబద్ధులై మీరు దీనిని రెండవ వేదవాక్యమునుగా విశ్యసింపవలెను. ఈస్వప్నమును వేదవాక్యమునుగా నేలవిశ్వసింపవలెనందురేమో చెప్పెదనువినుండి. పూర్వకాలమునందు మంత్రద్రష్టలైన మన మహర్షులకు వేదములు ప్రత్యక్షమయిన విధమెట్టిదే. వారీశ్వరధ్యానముచేచూ కన్నులుమూసుకొని చింతించు చుండినప్పు డీశ్వర ప్రసాదమువలన ఆమహానుభావులకు వేదములు స్వప్నములవలె పౌడ గట్టి సర్వజనులకు పరమప్రమాణములయినవి. ఈశ్వరకటాక్షమాకాలపువారి పైని మాత్రముపడి యీకాలపువారికి లేకపోవునని భావింపకుఁడు. మహానుభావులయిన భక్తులకెప్పుడును భగవంతుని.