పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

నేనునిద్ర నుండిలేచి కన్నులు తెఱచి చూచినప్పటికిఁ బశ్చిమమున సూర్యుఁడుదయించు చుండెనని వెనుకటి ప్రకరణమునందుఁ జెప్పియుంటినికదా? ఏమియుఁదెలియనిక్రొత్తదేశములో తూర్పేదోపడమరయేదోతక్కినదిక్కులేవో సూర్యోదయమును బట్టిగాకమఱియెట్లు తెలిసికోఁగలిగితినని మీలోనికొందరు బుద్ధిమంతులకు .దీనింజదువు వారికిందలి యేవిషయమునందును సందేహముండరాదు గనుక సహేతముగాను తృప్తికరముగాను తగినసమాధానము జెప్పి యిప్పుడేవారి సంశయనివారణము చేసెదను."సంశ్యాత్మావినస్యతి" అనుభగవద్గీతా ప్రమాణము మీతెఱిఁగినదే యగుటచేతదానినెప్పుడును మనస్సులయందుంచుకొని యాస్తికశిరోమణులయినమీరు ప్రమాణబుద్ధితో నావాక్యములను వ్యాసవాక్యములేయని మాఱుమాటాడక విశ్వశించి మేలు పొందవలెను గాని నాస్తికాధములవలె సందేహపడి చెడిపోరాదు సుండీ. నేనుమేల్కనికన్నులువిచ్చి చూచునప్పటికి నేను వీపుమీఁదవెల్లవెలికలఁ బరుండి యుంటిని; అప్పుడు కన్నులపండువుగా సూర్యబింబము రత్నకుంభమువలె భూమికిమూరెడెత్తున నాయెడమవైపున దిజ్మండలము నందెఱ్రగాకానఁబడుచుండెను. అదిచూచి మొట్టమొదట నేను సూర్యుఁడస్తమించుచున్నాఁడని భ్రమించితినిగాని క్రిందికిపోక సూర్యబింబమంత కంతకు పయికిరా నారంభించుటచేత సూర్యోదయమే కాని యది సూర్యాస్తమానము కాదని కొంచెముసేపటిలోనే భ్రాంతినివారణము చేసికొంటిని. కర్మభూమి యైనభరతఖండమునందు కర్మప్రధానమయినబ్రాహ్మణవర్ణములో కర్మిష్ఠులయిన వ్యాసరాయాచార్యులవారికి నుపుత్రుండవయి కులుపవిత్రుఁడనయిన నేను మఱచియైననునిద్రలోసహి