పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252 సత్యరాజా పూర్వదేశయాత్రలు

తరువాత పులుసుతెచ్చి నేనుప్రక్కను వడ్డించమని చెప్పచుండగా నామాటవినక అన్నము మీదనే దానిని వడ్డించిపోయెను. అంతట ద్వాదశి పారణమునకు వచ్చెదనన్న బ్రాహ్మణుడు విభూతి పెట్టుకొని తానావరకు కట్టుకొనియున్న బట్టలతోనే వచ్చి రెండవ విస్తరిముందు కూరుచుండెను.మడికట్టుకొని రామాయ్యాఅని చెప్పినను నామాట లక్ష్యముచేయక కొంచెముసేపు కూరుచుండి,లేచి వీధిలోని కల్పశంకకు పోయివచ్చి తనవి మడిబట్టలేయని చెప్పచు మునుపటి బట్టలతోనే మరలవచ్చి కూరుచుండెను. అప్పడు నేనతని మొగము పారజూచి విభూతిరేఖలనుబట్టి స్మార్తబ్రాహ్మణుడని తెలిసికొని,వ్రతభంగమునకు శంకించి లేచిపొమ్మని చెప్పవలెనన్న మాట నాలుక చివరకు రాగా ఆపుకొని, విస్తరిముందు కూరుచున్న బ్రాహ్మణుని లేచిపొమ్మన్నచో దోషము వచ్చునని యెంచి విషణ్ణుడనయి యూరకుంటిని. పాపము!ఆబ్రాహ్మణుడు 'ద్వైతి 'యని నేనన్నమాట 'అద్వైతి 'యని గ్రహించి యిట్లు చేసియుండును.

ఇతరులకు వడ్డించవలెను వేగిరము పరిషేచనముచేయూ' మని మాఅన్నప్రదాత తొందరపెట్టుటచేత విధిలేక యాబ్రాహ్మణునకే యాపోశనము వడ్డించితిని. మసత్రాధికారి మిక్కిలి దొడ్డవాడు. నాకు ద్వాదశివ్రతము దక్కునట్లుగా నాటిదిన మవిసాకు కూరవండెను. మరియేదోకూర వండెనుగాని దానిపేరు నాకు తెలిసినదికాది. ఆవండిన కూరలయినను కలుపుకొనుటకు చాలకుండ మనదేశములో నూరుగాయలను వడ్డించినట్లు కొంచెముకొంచెముగా వడ్డించి మరలనడిగినను మారుతెచ్చినవాడుకాడు. పప్పకావలెనని యడుగగా అన్నము వండనేలేదన్నాడు. నెయ్యి కావలెనని యడుగగా అన్నము వడ్డించి చేతితోనే చిన్న గిన్నెతో తెచ్చి యభిఘరించిపోయినాడు. అప్పడు నాకు దేనితో భోజనముచేయుటకును తోచక యావర కన్నుముమీద వడ్డించిపోయి