పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము 245

చెన్నపురివా రెంతటి ధర్మాత్ములోయని యాశ్చర్యపడ జొచ్చితిని. ఇట్లాశ్చర్యపడుచుండగానే బండివాడు "సుబ్బరామ అయ్యర్ గారి అన్నసత్రం" అని వ్రాసియున్నచోట బండినిలిపి దిగుమని తలుపు తీసెను. అన్నసత్రమునకు కాదు వంటపూట యింటికని చెప్పను నేను దిగక కూరుచుండగా బండివాడువచ్చిభాషతో నాలుగుకేకలువేసి నన్ను చేయిపట్టుకొని లాగి నామూటతీసి క్రింద పడవైచెను. పరదేశములో వాడు నన్ను కొట్టి పోవునేమెాయన్న భయముచేత వెంటనే బండిదిగి మూడుపావలాలు చేతిలో బెట్టి వానిని పంపివేసి, పూటకూటి యిల్కెడనో కనుగొనవలెనన్న యుద్దేశముతో లోపలికిపోయి "ఇది అన్నసత్రమా" అని వంటచేయుచున్న బ్రాహ్మణు నడిగితిని. "అవిను, పూటకు భోజనమునకు కాలుకూపాయి. నాలుగణాలూ" అని యతడు నాలుగువేళ్ళు చూపెను. ఆమాటలతో నాకన్నసత్రముయొక్క అర్ధము బోధపడినందున మూటక్రిందదింపి, "నాకు ద్వాదశిపారణకు శుచిగా వంటచేసి పెడతావా?" అని యడిగితిని. "కావలసినంత శుచిగా చేసిపెడతా" నని యతడుబదులు చెప్పెను. అందుమీద "నేను బ్రాహ్మడికి పెట్టుకోవడాని కెవరైనా ద్వైతబ్రాహ్మలు దొరుకుతారా?" అని నేనాతనిని నడుగుచుండగా వాకిట కూరుచుండియున్న బ్రాహ్మణు డొకడువచ్చి తాను ద్వాదశి బ్రాహ్మణుడుగా వచ్చెదనని చెప్పెను. నేనెందుకు సంతోషించి స్నానము చేసి వచ్చుటకై లేచి యాతడు చూపిన 'కొల్లాయి'లో శిరస్నానము చేసి, తడిబట్ట యారవేసి కట్టుకొని శుచినయి, పొగయెడ నెక్కిన పాపము పోవుటకై సహస్ర గాయత్రీ జపముచేసి, ప్రాతజన్నిదములు తీసి క్రొత్తవి వేసికొని, పంచముద్రలును ద్వాదశపుండ్రములును ధరించి గోవిందనామ స్మరణ చేఅసికొనుచు విస్తరిముందు కూరుచుంటని.అన్నసత్రాధికారి రెండు విస్తళ్లలో ముందుగా అన్నము వడ్డించెను. అటు