పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్నానసంధ్యా ద్యనుష్తానములను మాసక జపములను తపములను జేయుచు మంత్రతంత్రములను గురుముఖమున నేర్చుకొని నిష్ఠాగరిష్ఠుఁడనయితిని. నా యాచారవ్యవహారములు చూచి నా తల్లియు మేనమామయు కూడ సంతోషపడుచుండిరి.

నేను నాల్గవ తరగతిలో చదువుకొనుచుండఁగా నాకు వివాహకార్యము తటస్థమయ్యెను. ఈ యాంధ్రదేశములో మా శాఖవారు మిక్కిలి తక్కువగా నున్నందున మాలో కన్యలు దొరుకుట మిక్కిలి కష్టము. అందుచేత సామాన్య స్థితిలో నున్నవారికి వేయి రూపాయలయిననియ్యక మూఁడేండ్లకన్య యయినను లభింపదు. మా మేనమామగారి కృషిచేత నిప్పాణి నృసింహాచార్యులుగారు తొమ్మిది సంవత్సరముల ప్రాయము గల తమ కొమార్తెను వేయి రూపాయలకే నాకిచ్చి వివాహము చేయుట కంగీకరించినారు. ఇటువంటి తరుణము మరల రాదనియెంచి నా మేనమామగారును తల్లిగారును జేరి నూటికి మూడు రూపాయలవడ్దికి మా పిత్రార్జితమయిన మాన్యముల మీఁద వేయి రూపాయలు ఋణము చేసి, వివాహవ్యయములకై యిన్నుఱు రూపాయలను మఱియొకరి యొద్ద అప్పుచేసి, శుక్ల సంవత్సర వైశాఖ మాశములో నొక మంచి ముహూర్తమున నాకు వివాహము చేసిరి. నాకప్పటికి పదునెనిమిది సంవత్సరములు దాటినవి. నా భార్య రూపవంతురాలు కాకపోయినను, గుణవంతురాలుగా కానఁబడెను. కులకాంతలకు గుణము ప్రధానముగాని చక్కఁదనము ప్రధానముకాదు. ఇట్లోక సంవత్సరము గడచిన తరువాత నా భార్యకు స్ఫోటకము వచ్చెను. అప్పుడాచెన్నది జీవించుటయే దుర్ఘటమని యెల్లవారును భావించినను, నేను పునశ్చరణ చేసిన వీరహనుమంత మంత్ర ప్రభావమువలన చిన్నదానికి ప్రాణబయము తప్పి కుడి కన్ను మాత్రము పోయెను. మొగము నిండ గోతులు పడి యాచిన్నది మఱింత కురూపిణియయినందున "భార్యారూపవతీశత్రు" వనెడుబాధ నాకు