పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

నాచారపిశాచావేష సన్యస్తవివేకులై యున్న పండితులయొక్కయు మనస్సులను మళ్లింప శక్తులుగాక విఫలప్రయత్నులై రాజశేఖరుఁడుగారు కొంతకాలమునకు లోకాఁతరగతు లయిరి రాజశేఖరుఁడుగారు కాలము చేసి యిప్పటికి రెండువందల సంవత్సరము లైనను ఆయన వలన మేలు పొందినవారి సంతతివా రిప్పటికిని ఆయనను బ్రశంసించు చుందురు. రాజశేఖరుఁడుగారి సంతతి వారుకూడ దేశమంతటను వ్యాపించి యిప్పుడు పెక్కుచోట్ల గొప్పస్థితి కలవారయి యున్నారు.


               సంపూర్ణము.