Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజ శేఖర చరిత్రము

<poem>జీవితకాలములోనే సుబ్రహ్మణ్యము పీఠ పురసంస్థానములొ యుద్యోగములు చేసి కడపట మంత్రియిై రాజకార్యముల యందును సంన్మార్గ ప్రవర్తనము నందును నసఁమానుఁడని పేరుపొందెను; అల్లు ళ్ళిద్దఱును పెద్దాపురపు రాజుగారి యెాలగములలోఁ గొలువు కుదిరి క్రమక్రమమముగా గొప్పదశను బొంది విశేషఖ్యాతిని సంపాదించిరి.

<poem>రాజశేఖరుఁడుగారి కుటుంబము లోనివారే కాక యాయనబంధ వర్గములో చేరిన వారుకూడ అధర్మవృత్తి కొంతకాల మిహలోకసుఖమును గలిగించినను సద్ధర్మవృత్తియిే శాశ్వితసౌఖ్యమునకు నిదానమని రాజశేఖరుఁడుగారి వర్తనము వలన నఱిఁగి నిరంతరము ధర్మమార్గప్రవిషులెై యుండుచు వచ్చిరి. చిన్నప్పు డేప్పుడో చచ్చిపోయిన మగఁడు పట్టుకొని వేదించుచునాృఁ డన్న సిద్ధాంతికుమార్తె పెద్దదె బ్రతికియున్న మఱియిెకమఁడు మిక్కిలిమక్కువతోతననాృశ్రయించి మెహింపఁజేయగా నాతనివెంట నింట దొరకీనసొత్తు నెత్తుకొని లేచిపోయి చెడి కడపట దాసి యయి తమ కన్నుల ముందఱనే గ్రామములోఁ దిరుగు చుండుటయు, బాల్యదసలోనే భర్తలను బోగోట్టుకొన్న భాగ్యహీనురాండెెైన మద్దియలు, పడు కష్టములును, అట్టివారు దురతిక్రమణీయమైన కామబాధకు తాళఁ జాలక యింద్రియచాపల్యముల వలలోఁబడి పొడగు చుండుటయు, కొంద ప్రతిదినము కన్నులారఁజూచి మనసు కరగి యట్టి బాలవితంతువుల దుర్దశను తొలగించుట కేమైన జేయవలయునని పలు ప్రయత్నములు చేసియు మూధ శిరోమణులయిన జనుల యొక్కయు