రాజశేఖర చరిత్రము
ములును విధ్యుక్తముగా జరిగిన పిన్నుట నొకదినమున పెద్దాపురమునుండివచ్చిన సభికుడు రాజశేఖరుఁడుగారి కడకువచ్చి తాను శీఘ్రముగావెళ్లవలాసి యున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను.
రాజ ---- నాముద్దు చెల్లించి యీపదిదినములును మీరున్నంచు నకు మనుగుడువు లయినదాఁకకూడ నుండి నాకనస్సును సంతోషపెట్టిమఱి వెళ్లవలయును.
సభి ---- ఇఁక నన్ను మన్నించి విడిచిపెట్టవలయును. మనము బయలుదేఱి యిచ్చటికి వచ్చుటకుముందు మాయూరికి విచ్చేసియున్నయాచార్య స్వాములవారు శ్వీముఖమును బంసినప్పడు వెంటనేరూపాయలనియ్యక తిరస్కరించినవాఁడని మా మేనల్లునకేమో యాంక్షపత్రిక వ్రాసినారనియు, మూడు దినములనుండి మావాసి యిల్లెవ్వరునుత్రొక్కి చూడకున్నారనియు, మంగలవాఁడు క్షారముచేయుటకుఁ గానిచాకలవాఁడు బట్ట లుదుకుటకుఁగాని రాకున్నారనియు, ఇప్పుడు యుత్తరము వచ్చినది. స్వాములవారు వెలివేసినప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో నీళ్ళయినను తోడుకోనియ్యరు.
రాజ ---- సన్యసు లెప్పుడును కామక్రోధాదులను వర్జించి పరమ శాంతులై యుండవలసినవారే; ఇంత యల్పదోషమున కంత కౄర శిక్షను విధింతురా?
సభి ---- సన్యాసులన్న పేరేకాని వారికున్న్ంతకోపము ప్రపంచ ములో నెవ్వరికి నుండదు. ఇదియేమి చూచినారు ? ఈస్వాములవారే క్రిందటి సంవత్యరము శ్రీకాకుళములో భిక్షకువెళ్ళిన యింటి యజమా నుని భార్యతో నేమో సరసమాఁడగా మగఁడు విని సన్యాసి నేమోన