పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

మూన నపాత్రనమున కొప్పుకొనక యోగ్యులును పండితులునగు కొందఱిని యధాశక్తిని స్తత్కరింపనెంచి, వచ్చిన బ్రాహ్మణులకంద ిఱికిని సంభావన యియ్యకపోయిన సభవారిలోఁ దలవంవుగా నుండుననిచెప్పివచ్చిన బంధువులతో వివాహదినములలోఁ దలయెత్తుకొని తిరిగియప్పులపాలై తరువాత నెల్లకాలమును దలవంచుకొని తిరుగుటకంటె నీయైదుదినములును తలవంచుకొని యావలఁ దలయెత్తుకొని తిరుగుటయే మంచిదనిచెప్పి తమయిష్టప్రకారమే జరిగించిరి; వీధులుగట్టి సత్రములువేయుట వృధావ్యయమని బంధువులును మిత్రులు నైనవారినిమాత్రమే భోజనమునకుఁ బిలిచి యాదరించిరి; ఈప్రకారముగాఁ జేయుటచేత మొదటనుద్దేశించుకొన్ని దానికంటెను వెచ్చుముతక్కువ పడినందున, మిగిలిన యాధనముపెట్టి కోడలికాభరణములు చేయించి పెట్టిరి.

కొమారుని వివాహమైన మూఁడవదినముననే సీతను మేంనల్లు డైన శంకరయ్యకిచ్చి రాజశేఖరుఁడుగారు పెండ్లిచెసిరి. ఈవివాహమును సమ స్తవిషయములయందును ముందుగా జరిగిన వివాహమునే పోలి యున్నది. ఈరెండు వివాహములయందును బూజముబంతులు మొదలగు దురాచారములును మోటుతనముగా నుండు వేడుకలును నాకబలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లుకొనుచు స్త్రిలుఁబురుఘలు నను భేదమును పాటింపక విచ్చిలవిడిగా నల్లరిచేయు చెడువాడుకయును మానపబడినవి; కుంటితనము గ్రుడ్డితనములోనుగాగల యంగవై కల్యముచేతఁ బాటువడ సనమర్ధు లయినవారును స్వదోషమువలనఁగాక దైవకృతమువలననే హినదశకు వచ్చిన దరిద్రులును సత్ప్రుర్తనముకలిగి సకలవిద్యావిశారదు లయియున్న పండితులును భగనద్భక్తులును మాత్రము ధనసత్కారమును బొందిరి. ఈరెండు వివాహ

                                                 29