పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేర చరిత్రము

వారిలో సిద్ధాంతి తనమీఁద రాజశేఖరుఁడుగారికి కోపమువచ్చిన దేమో యనుకొని తదనుగ్రహమును మరలఁబడయగోరి, నారాయణ మూర్తి తనయొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క నగలపెట్టె నొకకూలివానిచెత మోపించుకొనివచ్చి రాజశేఖరుఁడుగారి కొప్ప గించెను; మఱియు రాజశేఖరుఁడుగారికిఁ దెలియవలయునని బంధువులముందరను మిత్రులముందరను ఆయనను కొనియాడఁ జొచ్చెను; సుబ్రహ్మణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే యిప్పుడుమరలమారకవళ తొలఁగిపోయినది. కాఁబట్టి దానియంతటి దివ్యజాతకములోకములో మఱియొకటిలేదని పొగడదొడఁగెను. అసంగతి తెలిసికొని బీదతనము పచ్చినప్పుడు పెల్లనియ్యమన్నవారే యిప్పుడేలాగునైన, దమకన్యలను సుబ్రహ్మణ్యమునకుఁ జేసికొండనియు నాలుగువందల రూపాయలు వరదక్షిణయిచ్చెదమనియు రాజశేఖరుఁడుగారి చుట్టును దిరిగి యనుసరొంప మొదలుపెట్టిరి. వారు భాగ్యవంతులును అల్లునకుకానుకలను కట్నములను లెట్టువారును, అయినను వారిపిల్లల నెవ్వరినిజేసికోక రాజశేఖరుఁడుగారు కొమారునకు సూర్యనారాయణగారికొమారై మహాలక్ష్మినిఁ జేసికొనుటకే నిశ్చయించిరి.

తరువాత నొక సుభముహూర్తమును ముందుగా రాజశ్వఖ రుఁడుగారు కుమారుని వివాహముచెసిరి ; బోగముమేళము లేకపొయినయెడల నివహము శోభగాంచదని యెందఱుచెప్పినను, వారిమాటలనాదరింపక పాతిప్రత్యమును భోధింపఁదగిన యుత్తమదినములలో లంజలతోడిపొత్తు కూడదని భోగస్త్రీలపాటలకై విశేషధనమును వయయపెట్టక, యల్పధసముతో గాయకశిఖామణులచేత కర్ణరసాయముగా హరికీర్తనలు పాడించిరి. సదస్యమునాడు సంభావనసమయ