పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవప్రకరణము

గారు చల్లపాటువేళ బండ్లు చేసికొని నకుటుంబముగా బయలుదేరి రెండుమూడు దునములలో సూర్యనారాయణగారితోఁ గూడ రాజ మహేంద్రవరము చేరి, అక్కడ రామమూర్తిగారి లోపల రెండు దినములుండి, వారికడ దాచిన పాత్రసామగ్రిని దీసికొని వారినిగూడ వివాహమునకై వెంటఁ బెట్టుకొని సుఖముగాఁ బోయి ధవళేశ్వరము ప్రవేశించిరి.

పెద్దాపురమునుండి వచ్చిన కృష్ణజగపతి మహరాజుగారి సభికుఁడు రాజశేఖరుఁడుగారికి మాన్యములును గృహమును విదిపించియిచ్చి, మరలఁ దన ప్రభువారియొద్దకు పోఁగోరఁగా రాజశేఖరుఁడు గారాయనను బహువిధముల బతిమాలుకొని కొమారునియొక్కయు కొమారైయొక్కయు వివహములు జరుగువరకు నిలుచునట్లోడఁబఱిచిరి. రాజశేఖరుఁడుగారు మరల గ్రామమునకు వచ్చి మాన్యములువదవించుకొని ధనికులయి యున్నావన్నవార్త విన్నతోడనే బీదతనము వచ్చినప్పుడు మొగము చాటువేసిన పూర్వస్నేహితు లందఱును పెల్లగిరి రాసాగిరి. మున్ను పిలిచినను పలుకని యాశ్రిత కోతిలోనివారందఱును దినమున కారు పర్యాయము లింటిచుట్టును దిరుగనారంభించిరి;తొల్లి చూడమనసయినను గనఁబడని భృత్యవర్గము జీతబతైములులేకయే సదా గుమ్మమువద్ద నిలువఁజెచ్చెను. రామశాస్త్రియు సిద్ధాంతియు వచ్చి ముఖస్తుతులయందుఁ గమకుఁగల పాండిత్యప్రకర్షమును మునుపటికంటె ద్విగుణముగా బ్రకటించుచు వచ్చిరిగాని, తమవిద్యా పారస్యమును గ్రహించి యక్షరలక్షలిచ్చెడి మునుపటి యౌదార్యమును రసికత్వమును రాజశేఖరుఁడుగారియం దప్పుడున్నట్లు వారికిఁకనబడలేదు.








స్