పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

రాజ ---- అవును, మూ రేపనిమీఁద వచ్చినారు ; సూర్య ---- మీయింటి కినడుమ సుబ్బరాయఁడను చిన్నవాఁడు వచ్చినాడు. అతఁడెక్కడనున్నాడు ?

రాజ ---- ఆపేరుగలచిన్నవాఁ డెవ్వఁడును మాయింటికి రాలేదు.

సూర్య ---- మీ కొమారైను దొంగ లెత్తుకొనిపొయినప్పుడు మాగ్రామమునుండి తీసుకొని వచ్చినాఁడు. ఆతఁడు వేంకటేశ్వరుల మ్రొక్కును బట్టి తల పెంచుకొన్నాఁడు. మిక్కిలి చక్కనివాఁడు ; ఒక రాజుతోడఁగూడ బయాలుదేఱి మీయింటికివచ్చెద నని మాతోఁ జెప్పినాఁడు ; చున్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాఁడట !

రాజ ---- అతనితో మీకేమి పనియున్నది ?

సూర్య ---- మా యింటియొద్దఁ గొన్నిదినములున్నాఁడు; అతని రూపగుణసంపదను జూచి యతనికి నాకొమారైనిచ్చి వివాహముచేసి, నాకు పుత్రసంతానము లేదుగనుక అతని నిల్లఱిక ముంచుకోవలెనని నిశ్చయించుకొనినాడు. అని తరువాత రాజశేఖరుఁడ్దుగారు రుక్మిణి సుబ్బరాయఁడను పేరున పురుషవేషము వేసుకొని యుండుట లోనుగాఁగల వృత్తాంతము నంతను వినిపించి, వచిన్నదానిని తనకుమారుఁడైన సుబ్ర హ్మణ్య మునకుఁ జేసికొనియెదనని వాగ్ధానముచేసిరి. అంతట సూర్యనారా యణగారు పెన్నిధి దొరకిన పేదవానివలె పరమానంద భరితుఁడై, రాజశేఖరుఁడుగారి యొద్ద సెలవువచ్చునని వెంటబెట్టుకొని మఱునాఁడు మధ్యాహ్నమునకు మరల వచ్చును. అదినముననే రజశేఖరుఁడు