పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారు స్వగ్రామమునకుఁ బోపుట ---- సుబ్రహ్మణ్మము వివహము ---- సిత వివాహము ---- రాజశేఖరుఁడుగారు తానుబడిన కష్టములవలన కృ త్యమును నేర్చుకొని సుఖముగా జీవనము చేయు చుండుట.

మఱునాఁడు రాజుగారి యుత్తరువుప్రకారము రాజశేఖరుఁడు గారు సభకు వచ్చినప్పుడు, కృష్ణజగపతిమహారాజుగారు తన సభికు లలో నొకరిని బిలిచి రూపాయలసంచులను రెంటిని తెప్పించి ముందుబెట్టి 'మీరీధనమును బట్టుకొని రాజశేఖరుఁడుగారితో ధవళేశ్వ రమునకుఁ బోయి గృహమును మాన్యములను విడిపించియిచ్చిరం' డని యాజ్ఞాపించి, అవిగాక మఱి నాలుగువందలరూపాయలను రాజ శేఖరుఁడుగారికిచ్చి 'విరిసొమ్ముతోనే సీతయొక్కయు సుబ్రహ్మణ్మము యొక్కయు వివాహమూలనుజేసి వచ్చుబడికి మించినవ్యయ మెన్నఁడునుజేయక సుఖజీవనము చేయుచుండుఁ' దని హితబోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగారివద్ద సెలవువుంచ్చుకొని రాజశేఖరుఁడుగారు భీమవరమునకు వెళ్ళుప్పటికి, జగ్గంపేటనుండివచ్చి యింటికడ నెవ్వరోబంధువులు కాచియున్నారని సమాచారము తెలుసెను. ఆమాటవినివేగిరపడి యిల్లుచేరఁగా వీధియరుగుమీఁద నొక ముసలిబ్రాహ్మణుఁడుకూరుచుండి యుండెను. రాజశేఖరఁడుగారాయనున జూచి మూరెవరని ప్రశ్నవేయఁగా, తమ యింటిపేరు భావరాజుగా రనియు తనపేరు సూర్యనారాయణ యనియుఁ జెప్పి 'రాజశేఖరుఁడుగారు మీరేకారా' యని ప్రశ్నవేసెను.