Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

బదులుచెప్పి పోయెను. ఈహేతువునుబట్టియే నేను మీకు విశేష ధనము నియ్యఁలవఁడ నయ్యును, ఇయ్యక మీమాన్యములను మాత్రము విడిపించి యిచ్చుచున్నాను వానితో మీరు తృప్తిపొంది సుఖజీవనము చేయుచుండుఁడు.

అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు మీకు మఱియేదియైన గోరికకలదాయని రాజశేఖరుఁడుగారి. ఆయన ప్రభువువారి సుగుణసంపత్తిని వేయివిధములఁ గొనియాడి, తన కుటుంబమునకుఁ జేసిన మహోపకారమును స్మరించి తానుచెఱసాలలో నున్నకాలములో విజ్ఞానపత్రికను వ్రాసి పంపుట యొదలగు పనులలోఁ దన కత్యంత సహాయుఁడుగా నున్న మంచిరాజు పాపయ్యను చెఱనుండి విడిపింపుఁడనివేడుకొనెను. తన కపకారముచేసి శత్రువునందుకూడ దయ గలిగియుండుటను. శ్లాఘించి, రాజుగా రప్పుడే అతనిని విడిచిపెట్ట విజ్ఞాపత్రికను బంపి తాము కొలువు చాలించి యంతఃపురమునకు విజయంచేసిరి. అంత రాజశేఖరుఁడుగారు మొదలగువారు కొలువుకూటమునువిడిచి తమతమ యిండ్లకు బోయిరి.