పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
219 పదునాల్గవ ప్రకరము

రాజుమీఁద తొంరపడి మీకోపమును చూపినందునకేకదా మీకు కారాగృహబంధనము సంభవించినది. కాఁబట్టి యిఁకముం దెప్పుడును మీరు మీకంటె నధికులైన వారిమూఁద మీకోపమును కనఁబడును కుండవలయును. కొందణు మతిహిఅనులు పూర్వకాలమే మంచిదని పొగడి మీరుచేయుదోషములను కాలమునందారోపించి మిమ్మ నిరుత్యాహులను జేయుదురు ; కాని చక్కగా ఆలోచించి నాకుఁ తోఁచు చున్నది. పుంణ్యపాపములు మనుఝ్యల బ్రవర్తనములో నున్నవికాని కాలములో నేమియు లేవు. కాఁబట్టి మీరు చేసినదోషములకు కాలమునుదూషింపక మీప్రవర్తనమును తిన్న పఱచుకొనుటకే ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు చాలినంత సొమ్మున్నచో విశేషముగా లేదని మీరెప్పుడును చింత పవకుండ వలయును. ఈరీతిని దెలిపెడి పూర్వకథ నొకదానిని మీకుఁ జెప్పిదను వినుండి. పూర్వమొకధనవంతుఁడు శరీరమునిండ రత్న ఖచితము లైన స్వర్ణాభరణములను ధరించుకొని వీధినిబడిపోపుచుండఁగా, బీదవాఁడొకఁ డాతనిని వెంబడించి నగలను జూచి మాటిమాటికి నమస్కరింప నారంచించెను. ఆధనికుఁ అంతవిని జూచి 'నానగలలో నేనేదియు నీకియ్యలేదే. అందున కట్లు చేయుచున్నా' వని యడిగెను. ఆనగలు నాకక్కఱలేదు; మూరు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు చేసినాను; మీరును చూచుకొని సంతోషించుటయే కాని నగలవలన వేఱొక ప్రయోజనమును పొందఁజాలరు ; మీరు నగలను కాపాడుకొనుటకై అంతము శ్రమపడు చున్నరు; నాకాశ్రమ యక్కఱలేకయే సంతోషము లభించుచున్నది; మీకును నాకును గలవ్యత్యాస మిదియే' యని వాఁడు