పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

వచ్చటికి వెంటనే పంపివేయ మంత్రి కాజ్ణచేసి, దొంగతనమును పట్టు కొన్నందునకు సుబ్రహ్మణ్యమును శ్లాఘించి, రాజశేఖరుడుగారివంక దిరిగి రాజుగా రిట్లు చెప్పిరి:----


మీ రిదివర కెనన్నొకష్టముల ననుభవించి యా యాపదల నన్ని ట్టిని గడచి మరల సుఖము ననుభవించుదశకు వచ్చుచున్నారు. కాఁబట్టి మీకు నేను కొన్నిహితవాక్యములను జెప్పుబోవుచున్నాను. మీరు నామాటలను సావకాశముగా వినవలెను. పడినతరువాత లేచుట గొప్పతనముగాని యెప్పుడును పడకుండుట గొప్పతనము కాదు. మీ రితిని మనసునం దుంచుకొని వెనుకపడిన కష్టములకై విచారపడకుండవలయును.ఇతరులుచేయు ముఖస్తుతుల కుబ్బి, ఆదాయమునకంటె నధికమైన ధనము దానము చేయకుండ వలయును. ఒక్క కుటుంబములోవారు పలువురు పదిమందిలో నత్యంతమైత్రి కలిగియే యున్నను గృహము చేరినతోడనే గర్భశత్రువులుగా నుందురు.కాఁబట్టి మీకుట్టుంబమునం దట్టికొఱఁత కలుగకుండఁ కాపాడుచు రావలయును. విరోధమును సాధించుటకు మంచియుపాయము శాంతినివహించుటయే. మనకవ్వరిమీఁద నై నను పగతీర్చుకోవలె నని బుద్ధి పుట్టి దానిని మరలించుకో లేనియెడల మనము పగతీర్చుకో శక్తికలిగియుండియు క్షమింతుమేని,శత్రువులు సహితము మనలను జూచిబుద్ధి తెచ్చుకొని జ్ణానవంతులగుదురు.కప్ప కఱవవలెనని ప్రయత్నముచేసిన నెంత ప్రయోజనకారియగునో బీదవాఁడు గొప్పవానినిపగసాధింపఁ దలఁవుగొన్న నంత ప్రయోజన కారిగానే యుండును.వట్టిబెదరింపులతోనే ముగిసెడుకోపము నెవరు లక్ష్యము చేయుదురు? ఆట్టికోపమువలన మనకార్యమును సాధించుకోలేపోవుట. యటుండఁగా మీఁదిమిక్కిలి నష్టమునుకూడఁ బొందుదుము.మీరు శోభనాద్రి